అందుకే అప్పుడు పవన్ కళ్యాణ్‌తో యాక్ట్ చేయలేదు
పవన్ కళ్యాణ్ సినిమాలో పాటకు డ్యాన్స్ చేసే ఛాన్స్ అనుసుయకు ఒకప్పుడు వచ్చింది. కానీ అప్పుడు చెయ్యనని చెప్పేసింది అనుసుయ. ఆ టైంలో అదో పెద్ద కాంట్రవర్సీగా మారింది. అయితే మళ్ళీ ఇన్నేళ్ళక అనుసుయ హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ తో కలిసి స్టెప్పులు వేసింది. ఈ మేరకు అనుసుయ తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ అనేక విషయాల్ని పంచుకుంది.
పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలోని పబ్ సాంగ్ లో అనుసుయ నటించాల్సి ఉంది. కానీ అనుసుయ అప్పుడు నో చెప్పింది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ వంటి స్టార్లకు అనుసుయ నో చెప్పిందే అంటూ అప్పట్లో అదో పెద్ద కాంట్రవర్సీగా మారింది. తనకు నచ్చలేదు కాబట్టే ఆ ఆఫర్ ని తిరస్కరించానని అనుసుయ ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. ఇక ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అంటూ అనుసుయ డ్యాన్స్ చేసింది. ఈ విషయం పై తాజాగా అనుసుయ స్పందించింది. అప్పుడేమో అలా రిజెక్ట్ చేయడం, ఇప్పుడు అంగీకరించడం వెనుక ఉన్న కారణాలు చెప్పేసింది. అప్పుడు మైండ్ సెట్ వేరు, అప్పుడు తనకు చాలా విషయాలు అర్థమయ్యేవి కావని, అప్పుడు ఆ టైంకి అదే కరెక్ట్ అనిపించింది అంది. అందుకే అలా నో చెప్పానని, అంతే తప్ప మరే ఇతర కారణం లేదని, నాటి విషయాల గురించి చెప్పింది. ఇక ఇప్పుడు మైండ్ సెట్ మారిందని, ఎంతో మార్పు వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పింది. పవన్ కళ్యాణ్ అంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా ఎంతో హంబుల్ గా ఉంటారని, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారని, ఎన్నో త్యాగాలు చేశారని చెప్పుకొచ్చింది. ఎన్నో వాటికి నో చెప్పారని అతను రియల్ హీరో అని అంది. మెగా బ్రదర్స్ అంతా కూడా చాలా మంచి వారని, చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్ ల వ్యక్తిత్వం ఒకేలా అనిపిస్తుందని చెప్పింది. తనని బయట అంతా మెగా కాంపౌండ్ నటి అంటారని, అలా కలిసి వచ్చిందంతే కానీ అయితే వైష్ణవ తేజతో నటించాల్సి ఉంది అని అనుసుయ చెప్పుకొచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రమాదవశాత్తు బావిలో పడిన పెద్దపులి, అడవిపంది… చివరిలో సూపర్ ట్విస్ట్