రెండు తలల అరుదైన పాము.. దీని ఆయుర్దాయం ఎంతో తెలిస్తే షాకే..
ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉంటాయి. పాములు సాధారణంగా విషపూరితమైనవి.. ప్రమాదకరమైనవి కూడా. అయితే కొన్ని పాములు చాలా విచిత్రంగా అనిపిస్తాయి.
ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉంటాయి. పాములు సాధారణంగా విషపూరితమైనవి.. ప్రమాదకరమైనవి కూడా. అయితే కొన్ని పాములు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అటువంటి పాముల్లో ఒకటి రెండు తలల పాము. తాజాగా ఈ రెండు తలల పాము గురించి ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి.. రెండు తలల పాములు చాలా అరుదు. ఈ పాములు సాధారణంగా ఎక్కువ కాలం జీవించవు. అయితే ఇటీవల ఒక బ్లాక్ రాట్ స్నేక్ ఏకంగా 17 సంవత్సరాలు జీవించినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ పాము ఇప్పటికీ సజీవంగా, ఎటువంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా జీవిస్తోంది. మిర్రర్ నివేదిక ప్రకారం.. 2005లో, ఒక అమెరికన్ బాలుడు మిస్సౌరీలోని డెల్టా నగరంలో ఈ అరుదైన రెండు తలల పామును కనుగొన్నాడు. ఇది సుమారు ఐదడుగుల పొడవుతో రెండు ముఖాలు కలిగి ఉంది. తర్వాత ఈ పాముని కేప్ గిరార్డో కన్జర్వేషన్ నేచర్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అప్పటి నుండి ఆ పాము అక్కడే నివసిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: