ట్రాఫిక్‌ జామ్‌ వల్లే ప్రేమలో పడ్డా.. కానీ ఆ కష్టాలు మాత్రం తీరలేదు

|

Sep 29, 2022 | 1:58 PM

బెంగళూరు ట్రాఫిక్‌ జామ్‌ తన పెళ్లికి కారణమని ఓ వ్యక్తి రెడ్డిట్‌లో పోస్ట్‌ చేసిన లవ్‌ స్టోరీ స్క్రీన్‌ షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ట్రాఫిక్‌ జంక్షన్‌ వద్ద ఒక మహిళను చూసి ప్రేమలో పడినట్లు తెలిపాడు.

బెంగళూరు ట్రాఫిక్‌ జామ్‌ తన పెళ్లికి కారణమని ఓ వ్యక్తి రెడ్డిట్‌లో పోస్ట్‌ చేసిన లవ్‌ స్టోరీ స్క్రీన్‌ షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ట్రాఫిక్‌ జంక్షన్‌ వద్ద ఒక మహిళను చూసి ప్రేమలో పడినట్లు తెలిపాడు. మూడేళ్ల డేటింగ్‌ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడట. ఒక రోజు తన వాహనంపై ఆమెను ఇంటికి డ్రాప్‌ చేస్తుండగా ఎజిపురా ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల భారీ ట్రాఫిక్‌ జామ్‌లో తాము చిక్కుకున్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు. ఒకవైపు ఆలస్యం, మరోవైపు ఆకలి వల్ల చిరాకు చెందిన తాము మరో మార్గంలో వెళ్లామని, ఈ సందర్భంగా కలిసి డిన్నర్‌ చేయడంతో ఇద్దరం ప్రేమలో పడినట్లు వివరించాడు. మూడేళ్ల డేటింగ్‌ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నానని వెల్లడించాడు. ఇదంతా జరిగి ఐదేళ్లు అయ్యిందన్నాడు. అయితే తమ ఇద్దరినీ కలిపిన, ట్రాఫిక్‌ జామ్‌కు కారణమైన 2.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణం ఇంకా కొనసాగుతుందంటూ విమర్శించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జైళ్లల్లోనే ఖైదీల‌కు దాంప‌త్య జీవితం.. ఎక్కడంటే ??

తల్లిని ఆటపట్టిస్తూ పిల్ల ఎలుగుబంటి రచ్చ.. ఏం చేసిందో తెలుసా ??

బుద్ధిలేని మాస్టర్.. క్లాస్‌రూమ్‌లోనే మందేసి చిందులు.. పైపెచ్చు…

తవ్వకాల్లో బయటపడ్డ వేల ఏళ్ల నాటి గుహ.. అందులో ఏమున్నాయో చూస్తే కళ్లు జిగేల్‌..

విశాల్ ఇంటిపై దాడి.. భయాందోళనలో హీరో ఫ్యామిలీ

Published on: Sep 29, 2022 01:57 PM