తల్లిని ఆటపట్టిస్తూ పిల్ల ఎలుగుబంటి రచ్చ.. ఏం చేసిందో తెలుసా ??

నిత్యం సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో చిన్న పిల్లల వీడియోలు కూడా బాగా వైరల్‌ అవుతాయి. నిజానికి పసిపిల్లలు ఎంతో క్యూట్‌గా అమాయకంగా కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తారు.

తల్లిని ఆటపట్టిస్తూ పిల్ల ఎలుగుబంటి రచ్చ.. ఏం చేసిందో తెలుసా ??

|

Updated on: Sep 29, 2022 | 9:52 AM



నిత్యం సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో చిన్న పిల్లల వీడియోలు కూడా బాగా వైరల్‌ అవుతాయి. నిజానికి పసిపిల్లలు ఎంతో క్యూట్‌గా అమాయకంగా కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తారు. పసివాళ్లను చూస్తే ఎంతటివారైనా కరిగిపోతారు. ఇది కేవలం మనుషుల విషయంలోనే కాదు పశుపక్ష్యాదులకు కూడా వర్తిస్తుంది. తాజాగా ఓ పిల్ల ఎలుగుబంటి దాని అల్లరితో తన తల్లిని ముప్పు తిప్పులు పెడుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఓ తల్లి ఎలుగుబంటికి రెండు పిల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటిలో ఒకటి మహా కంత్రీ, మరొకటి పూర్తి సైలెంట్. ఈ కంత్రీ ఎలుగుబంటి పిల్ల రచ్చ రచ్చ చేసింది. ఉన్నట్లుండి.. ఓ సన్నని చెట్టు ఎక్కేసింది. చిటారు కొమ్మకు చేరుకుని గట్టిగా హత్తకుని అక్కడే కూర్చుంది. అది గమనించిన తల్లి ఎలుగుబంటి.. దానిని కిందకు పిలిచింది. అయినా రాకుండా మారాం చేసింది. ఇంకేముంది.. మాతృమూర్తి మరో అవతారం ఎత్తింది. దిగుతావా? నీ సంగతి చెప్పనా అంటూ పిల్ల ఎలుగుబంటిని కిందకు దించేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. చెట్టును అటూ ఇటూ ఊపింది. అయినా రాకపోవడంతో.. చెట్టును ఎక్కే ప్రయత్నం చేసింది. అయితే, దాని బరువుకు ఆ చెట్టు తట్టుకోలేకపోయింది. దాంతో ఏకంగా ఆ చెట్టును కిందకు వంచి విరిచేసింది. దెబ్బకు కిందకు వచ్చిన ఆ పిల్ల ఎలుగుబంటి.. తల్లి చేతికి చిక్కకుండా తుర్రుమని పారిపోయింది. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను చూసి తమ గతాన్ని నెమరు వేసుకుంటున్నారు కొందరు నెటిజన్లు. కొందరైతే రోజూ మా ఇంట్లో ఇదే పరిస్థితి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుద్ధిలేని మాస్టర్.. క్లాస్‌రూమ్‌లోనే మందేసి చిందులు.. పైపెచ్చు…

తవ్వకాల్లో బయటపడ్డ వేల ఏళ్ల నాటి గుహ.. అందులో ఏమున్నాయో చూస్తే కళ్లు జిగేల్‌..

విశాల్ ఇంటిపై దాడి.. భయాందోళనలో హీరో ఫ్యామిలీ

ఆసుపత్రిలో దీపిక !! గుండె పనితీరుపై డాక్టర్ల వార్నింగ్

5 లక్షలని.. అత్యాశకు పోయి.. న్యూడ్ ఫోటోలు బయటపడేసుకుంది

Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..