Watch Video: కొండలు ఎక్కి, గుట్టలు దాటొచ్చి ఓటు వేసిన గిరిజనులు.. వీరు ప్రజాస్వామ్య స్పూర్తి ప్రదాతలు..

|

May 13, 2024 | 11:12 AM

AP Elections 2024: ఓటు కోసం డోలిలో ప్రయాణించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఈ గిరిజన ప్రజలు. అన్నీ ఉన్నా ఓటు వేయడానికి కొందరికి బద్దకం. కానీ ఏమీ లేని వారు ప్రజాస్వామ్య స్పూర్తిని నిలువెత్తునా చాటి చెబుతున్నారు. ఓటు గొప్పతనాన్ని దేశానికి మరోసారి చూపిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో రోడ్లు, వాహనాలు ఇలా చాలా మౌళిక సదుపాయాలు ఉన్నప్పటికీ కొంత మంది ఓటు వేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటింది. ఓటు వేయడానికి ఉత్సాహం చూపని వారికి చెంపపెట్టుగా నిలిచింది.

ఓటు కోసం డోలిలో ప్రయాణించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఈ గిరిజన ప్రజలు. అన్నీ ఉన్నా ఓటు వేయడానికి కొందరికి బద్దకం. కానీ ఏమీ లేని వారు ప్రజాస్వామ్య స్పూర్తిని నిలువెత్తునా చాటి చెబుతున్నారు. ఓటు గొప్పతనాన్ని దేశానికి మరోసారి చూపిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో రోడ్లు, వాహనాలు ఇలా చాలా మౌళిక సదుపాయాలు ఉన్నప్పటికీ కొంత మంది ఓటు వేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటింది. ఓటు వేయడానికి ఉత్సాహం చూపని వారికి చెంపపెట్టుగా నిలిచింది. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

వీరిని చూసైనా ఓటు వేసేందుకు జనాలు ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు కొందరు నెటిజన్లు. దేశ భవిష్యత్తును మార్చే ఆయుధం ఓటు హక్కును ఇప్పటికైనా వినియోగించుకోమని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కవిత్వాన్ని తలుచుకోవాలి.. పరుగెత్తు.. లేకుంటే నడుచుకుంటూ అయినా వెళ్లు.. వీలుపడలేదా.. పాకుతూ అయినా వెళ్లు ఏదో ఒకటి సాధించు అంటారు. అలాగే దేహానికి తప్ప దాహానికి ఉపయోగపడని సముద్రపు కెరటాలే ఎగసెగసి పడుతుంటే అన్నట్లు ఏ మౌళిక సౌకర్యాలు లేకుండానే ఓటుకోసం ఇంతగా తపిస్తుంటే.. అన్నీ ఉన్న కొందరు మాత్రం ఓటు కోసం ఆసక్తి చూపడం లేదు. అందుకే ఈ డోలి బాట పట్టిన వారికి సలాం చేస్తూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నారు ప్రజాస్వామ్య వాదులు.

ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Published on: May 13, 2024 11:04 AM