Viral Video: షాపింగ్‌కు వచ్చిన వింత అతిథి.. బిత్తరపోయిన యజమాని.. ఏం చేసిందో తెలుసా?

Trending Video: రోడ్డు పక్కనే ఉన్న ఓ షాప్‌లో యజమాని ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు. బయటనుంచి ఏదో శబ్దం వినిపించడంతో లేచి చూస్తాడు. కానీ

Viral Video: షాపింగ్‌కు వచ్చిన వింత అతిథి.. బిత్తరపోయిన యజమాని.. ఏం చేసిందో తెలుసా?
Lizard Viral Video

Updated on: Dec 10, 2021 | 10:50 AM

Viral Video: నెట్టింట్లో ఎన్నో వీడియోలు ప్రతిరోజూ తెగ సందడి చేస్తుంటాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలు చాలానే ఉన్నాయి. వీటిపై నెటిజన్లు కూడా ప్రత్యేక ఆసక్తిని చూపిస్తుంటారు. వీటిలో కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఏడిపిస్తుంటాయి. మరికొన్ని సందేశాలను ఇస్తుంటాయి. అయితే ప్రస్తుతం చూసే వీడియో మాత్రం ఓ వైపు భయం, మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే..

రోడ్డు పక్కనే ఉన్న ఓ షాప్‌లో యజమాని ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు. బయటనుంచి ఏదో శబ్దం వినిపించడంతో లేచి చూస్తాడు. కానీ, అతనికి ఏమీ కనిపించకపోవడంతో తన ఫోన్‌లో నిమగ్నమైపోతాడు. ఇంతలో ఓ లిజార్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో, కానీ, షాప్‌లోకి దూరింది. దానిని గమనించిన యజమాని మాత్రం భయంతో అలాగే ఉండిపోతాడు. అది ఎంచక్కా షాపింగ్‌కు వచ్చినట్లుగా షాప్‌లోకి దూరి ఏదో సీరియస్‌గా వెతుకుతున్నట్లు సందడి చేసింది. అన్ని ఏరియాలు తిరుగుతూ కనిపించింది.

అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం కామెంట్లతో తమ సత్తా చూపిస్తూ, ఫన్నీగా ఆన్సర్స్‌ ఇచ్చారు. షాపింగ్‌కు వచ్చిన లిజార్డ్‌ను చూడండంటూ ఒకరు కామెంట్ చేయగా, పాపం షాపింగ్‌లో దానికి కావాల్సినవి దొరకలేదనుకుంటా అంటూ మరొకరు కామెంట్ చేశారు. హెల్తీ లైఫ్ స్టైల్ కోసం తనకు కావాల్సిన ఫుడ్ కోసం వెతుకుతున్నట్లు ఉందంటూ మరికొందరు కామెంట్లు చేశారు. ఈ షాప్‌కు రెగ్యులర్ కస్టమర్ అనుకుంటా అంటూ ఇంకొంతమంది కామెంట్ చేశారు. ఈ వీడియోను ట్రాయ్ లాసన్ అనే పేసు‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేశారు. ‘గ్రాసరీ డ్యూటీలో బిజీగా ఉన్న లిజార్డ్’ అంటూ క్యాఫ్షన్ అందించారు. 42 మిలియన్ల వ్యూస్, 34వేలకు పైగా లైక్స్, 4వేలకు పైగా కామెంట్లతో ఈ వీడియో నెట్టింట్లో దూసుకపోతోంది.

Also Read: Viral Video: పాపం! వరుడ్ని చెడుగుడు ఆడుకున్న స్నేహితులు.. వీడియో చూస్తే కడపుబ్బా నవ్వుతారు!

TS MLC Elections: ఎమ్మెల్సీ పోలింగ్ అభ్యర్థుల బలాబలాలు ఇవే.. లైవ్ వీడియో