Viral Video: వారెవ్వా.. ఈ శునకం తెలివితేటలు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే..!
Trending Video: నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో ఫన్నీ వీడియోలు సందడి చేస్తుంటాయి. అందులో జంతువులకు సంబంధించినవైతే మరీను. ఇలాంటి వీడియోలు మన ముఖంలో చిరునవ్వు తెప్పిస్తాయనడంలో సందేహం..
Viral Video: నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో ఫన్నీ వీడియోలు సందడి చేస్తుంటాయి. అందులో జంతువులకు సంబంధించినవైతే మరీను. ఇలాంటి వీడియోలు మన ముఖంలో చిరునవ్వు తెప్పిస్తాయనడంలో సందేహం లేదు. కానీ, ప్రస్తుతం మీకు చూపిస్తున్న వీడియోను చాలా అరుదుగా చూసి ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక కుక్క తన యజమానికి పనిలో సహాయం చేస్తోంది. తన పనిని సులభతరం చేయడానికి ఉపయోగించే ట్రిక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియో redditలో షేర్ అయింది. “తన యజమానికి టైర్లను తరలించడంలో సహాయపడటం, ఒకేసారి నాలుగు టైర్లను ఎలా తీసుకువెళ్లాలో ఆలోచిస్తూ ఉండటం” క్యాఫ్షన్‌ను అందించారు.
కుక్క ముందు ఓ వ్యక్తి నాలుగు టైర్లను తీసుకొచ్చినట్లు వీడియోలో చూడొచ్చు. మొదట కుక్క వాటిని కాసేపు చూసి, తన నోటితో వాటిని పట్టుకోవడానికి వాటిని ఒకచోట చేర్చడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ వీడియోలో డాగీ తన పనిని ఎలా విజయవంతంగా పూర్తి చేస్తుందో చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఈ వీడియోని నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. కుక్క మెదడును అందరూ కొనియాడుతూ కామెంట్లు చేస్తున్నారు.
డాగీ అతని కంటే తెలివైనదని కొందరు సరదాగా రాసుకొచ్చారు. మరొకరు, “ఈ కుక్కకు కొంతమంది వ్యక్తుల కంటే మెరుగైన సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉన్నాయి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Viral News: సలామ్ రైతన్న.. చేతి వాడకుండానే పేడను ఎత్తాడు.. ఏం టెక్నాలజీ గురూ..!
Watch Video: కూతురితో కలిసి స్టెప్పులేసిన మంత్రి ఆదిమూలపు సురేష్.. స్పెషల్ ఏంటంటే? వీడియో..