ట్రెక్కింగ్‌ చేస్తూ ఇద్దరి మృతి.. 48 గంటల పాటు శునకమే కాపలా

|

Feb 10, 2024 | 12:05 PM

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బీర్‌ బిల్లింగ్‌లో ప్రమాదం జరిగింది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఇద్దరు యువతీయువకులు మంచులో కూరుకుపోయి తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా.. వారివెంట వెళ్లిన జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన శునకం ఆ మృతదేహాలను గుర్తించడంలో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు వాటి దగ్గరే ఉంటూ బిగ్గరగా మొరుగుతూనే ఉంది. అది గమనించిన సహాయక బృందాలు వాటిని వెలికితీశాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బీర్‌ బిల్లింగ్‌లో ప్రమాదం జరిగింది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఇద్దరు యువతీయువకులు మంచులో కూరుకుపోయి తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా.. వారివెంట వెళ్లిన జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన శునకం ఆ మృతదేహాలను గుర్తించడంలో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు వాటి దగ్గరే ఉంటూ బిగ్గరగా మొరుగుతూనే ఉంది. అది గమనించిన సహాయక బృందాలు వాటిని వెలికితీశాయి. మృతులను పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన అభినందన్‌ గుప్త, పుణెకి చెందిన ప్రణీతగా గుర్తించారు. బీర్‌ బిల్లింగ్‌ ప్రదేశం సముద్రమట్టానికి 5 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. పలువురు సాహస యాత్రికులు ఇక్కడ ట్రెక్కింగ్‌, పారాగ్లైడింగ్‌ చేస్తుంటారు. గుప్తా గత నాలుగేళ్లుగా ఇక్కడే ఉంటూ ట్రెక్కింగ్‌ చేసేవాడు. కొత్తగా వచ్చేవారిని తనవెంట తీసుకెళ్తుండేవాడు. ప్రణీత కొన్ని వారాల క్రితమే ఇక్కడికి వచ్చారు. మొత్తం నలుగురు సభ్యుల బృందం బీర్‌ బిల్లింగ్‌ను చూసేందుకు కారులో బయలుదేరారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్కడ అందరూ రిచ్‌.. ఒక్కొక్కరూ రూ. కోటి సంపాదిస్తారు

పిల్లల దాహార్తిని తీర్చడం కోసం ఓ మహిళ చేస్తున్న సాహసం

వచ్చేసిన మాఘమాసం.. పెళ్లికాని ప్రసాదులకు పండగే

విండోస్11 యూజర్లకు కీలక అలర్ట్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్..

Guntur Kaaram: OTTలో గుంటూరోడికి దిమ్మతిరిగే రెస్పాన్స్.. ఇది మహేష్‌ క్రేజ్‌ అంటే !!