Train one Year Delay: వామ్మో..! ఒకరోజు కాదు.. ఏకంగా ఏడాది లేటుగా చేరుకున్న రైలు..! అవాక్కైన అధికారులు..!

|

Jun 04, 2022 | 7:50 AM

మన దేశంలో రైళ్లు ఆలస్యంగా వచ్చే విషయంలో ఎన్నో జోకులు పేలుతుంటాయి. ఓ రైలు జీవితకాలం లేటు అన్న ఛలోక్తి తరచూ వింటూ వుంటాం. కానీ ఓ రైలు మాత్రం లేటు అనే పదానికి అర్థమే మార్చేసింది. ఒక గంటో రెండు గంటలో కాదు అలాగని ఒకటి రెండు రోజులు కూడా కాదు..


మన దేశంలో రైళ్లు ఆలస్యంగా వచ్చే విషయంలో ఎన్నో జోకులు పేలుతుంటాయి. ఓ రైలు జీవితకాలం లేటు అన్న ఛలోక్తి తరచూ వింటూ వుంటాం. కానీ ఓ రైలు మాత్రం లేటు అనే పదానికి అర్థమే మార్చేసింది. ఒక గంటో రెండు గంటలో కాదు అలాగని ఒకటి రెండు రోజులు కూడా కాదు.. ఏకంగా చేరాల్సిన గమ్యస్థానానికి ‘సంవత్సరం’ లేటుగా చేరుకుంది. దీంతో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. రైలు లేటు కారణంగా పేదలకు అందాల్సిన ఆహారం కాస్తా పూర్తిగా పాడైపోయింది.2021 మే నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో పట్టాలెక్కిన ఒక రైలు ఏడాది తర్వాత గానీ గమ్యం చేరలేదు. ఓ బోగిని వెయ్యి బియ్యం బస్తాలతో నింపారు. 762 కిలోమీటర్లు ప్రయాణించి ఝార్ఖండ్‌లోని న్యూ గిరిడీ స్టేషన్‌ను అది చేరుకోవాలి. సాంకేతిక కారణాలతో అది నిర్ణీత సమయానికి ముందుకు కదలలేదు. తర్వాత దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ బోగితో గూడ్సు రైలు ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగా ఈ నెల 17న న్యూ గిరిడీ స్టేషన్‌ను చేరుకుంది. ఏడాది ఆలస్యం కావడంతో.. 200 నుంచి 300 బస్తాల బియ్యం పాడైపోయిందని అధికారులు తెలిపారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రైల్వే శాఖ ఉన్నాతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!