Kona Waterfalls: ఆకట్టుకుంటున్న కోన జలపాతాలు.. జలధారలలో ఎంజాయ్‌ చేస్తున్న పర్యాటకులు.

Kona Waterfalls: ఆకట్టుకుంటున్న కోన జలపాతాలు.. జలధారలలో ఎంజాయ్‌ చేస్తున్న పర్యాటకులు.

Anil kumar poka

|

Updated on: Sep 09, 2023 | 8:08 PM

వాటర్‌ఫాల్స్‌ అంటే ఇష్టపడని వారుండరు. ఎత్తయిన కొండలపైనుంచి పాలనురుగులా జాలువారే జలపాతాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఇలాంటి జలపాతాలను చూసేందుకు పర్యాటకులు ఊటీ, కొడైకెనాల్‌ లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇటీవల తెలంగాణ ప్రాంతంలోనూ కొన్నిఅద్భుతమైన జలపాతాలు వెలుగుచూశాయి. తాజగా అనంతపురం జిల్లాలో ని కోన జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

వాటర్‌ఫాల్స్‌ అంటే ఇష్టపడని వారుండరు. ఎత్తయిన కొండలపైనుంచి పాలనురుగులా జాలువారే జలపాతాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఇలాంటి జలపాతాలను చూసేందుకు పర్యాటకులు ఊటీ, కొడైకెనాల్‌ లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇటీవల తెలంగాణ ప్రాంతంలోనూ కొన్నిఅద్భుతమైన జలపాతాలు వెలుగుచూశాయి. తాజగా అనంతపురం జిల్లాలో ని కోన జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలంలోని కోన ఉప్పలపాడు గ్రామంలో జలపాతాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొండపై నుండి జాలువారుతున్న జలపాతాలు ఊటీ, కొడైకెనాల్‌ను మించి పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలు కళకళలాడుతున్నాయి. జలపాతాలను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. ఫోటోలు, సెల్ఫీలకు పోజులిస్తున్నారు. చుట్టూ పచ్చని చెట్లమధ్య జలజల రాలుతున్న జలధారలలో జలకాలాడుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..