Viral Video: కోటిమందిని కదిలించిన చిన్నారి.. చిన్నారి మంచిమనసుకు నెటిజన్లు ఫిదా.
ప్రతిరోజూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చూస్తుంటాము. కొన్ని వీడియోలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. మరికొన్ని ఎంతగానో నవ్విస్తాయి. ఇంకొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రపంచంలో ఇంకా మానవత్వం మిగిలి ఉందని అనిపిస్తుంది. సాటి మనిషిపట్ల ఓ చిన్నారి చూపించిన పెద్దమనసు నెటిజన్లను కట్టిపడేస్తుంది.
ప్రతిరోజూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చూస్తుంటాము. కొన్ని వీడియోలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. మరికొన్ని ఎంతగానో నవ్విస్తాయి. ఇంకొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రపంచంలో ఇంకా మానవత్వం మిగిలి ఉందని అనిపిస్తుంది. సాటి మనిషిపట్ల ఓ చిన్నారి చూపించిన పెద్దమనసు నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఈ వీడియోలో రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నాయి. ఆ రోడ్డు పక్కనే ఓ బిచ్చగాడు భిక్షాటన చేసుకుంటూ నిలబడి ఉన్నాడు. అతనికి కళ్లు లేనట్లు తెలుస్తోంది. ఆ బిచ్చగాడిని చూస్తూ చాలామంది వెళ్లిపోతున్నారు. స్కూల్ బ్యాగ్ వేసుకొని వెళ్తున్న ఓ చిన్నారి అతని దగ్గరకు వచ్చింది. తన లంచ్‌బాక్స్‌నుంచి శాండ్‌విచ్‌ని తీసి అతనికి ఇవ్వబోయింది. అతను దానిని తీసుకోలేకపోయాడు. దాంతో అతనికి కళ్లుకనిపించవని చిన్నారికి అర్ధమైంది. ఆ చిన్ని మనసు కరిగిపోయింది. వెంటనే అతనికి తన చేత్తో శాండ్‌విచ్ తినిపించింది. వాటర్ బాటిల్ ఇచ్చింది. అనంతరం అతను థాంక్స్ చెబుతుంటే తన చిట్టి చేతిని అతనిచేతిలో వేసి థాంక్స్ చెప్పింది. ఈ వీడియో ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు కోట్లాది మంది వీక్షించారు. వీడియోలో అమ్మాయి బిచ్చగాడికి సహాయం చేసిన విధానాన్ని చూసి చిన్నారిని అభినందిస్తున్నారు, ఈ రోజుల్లో ఇంతటి దయగల పిల్లలు చాలా తక్కువగా కనిపిస్తున్నారంటూ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..