Bengaluru: బెంగళూరులో కుండపోత వర్షం.. 133 ఏళ్ల రికార్డు బ్రేక్‌!

|

Jun 06, 2024 | 9:54 PM

నీటి ఎద్దడితో అల్లాడిన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు. నగరంలో ఆదివారం ఒక్కరోజే దాదాపు 111 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌ నెలకు సంబంధించి ఒక్కరోజులోనే ఈ స్థాయి వర్షం కురవడం 133 ఏళ్లలో ఇదే తొలిసారని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. జూన్‌ 1, 2వ తేదీల్లో కలిపి మొత్తం 140.7 ఎం.ఎం వర్షపాతం నమోదైంది.

నీటి ఎద్దడితో అల్లాడిన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు. నగరంలో ఆదివారం ఒక్కరోజే దాదాపు 111 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌ నెలకు సంబంధించి ఒక్కరోజులోనే ఈ స్థాయి వర్షం కురవడం 133 ఏళ్లలో ఇదే తొలిసారని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. జూన్‌ 1, 2వ తేదీల్లో కలిపి మొత్తం 140.7 ఎం.ఎం వర్షపాతం నమోదైంది. దీంతో ఏటా జూన్‌ మొత్తంలో కురిసే సగటు వర్షపాతాన్ని ఇప్పటికే దాటేసినట్లు తెలిపారు. నగరంలో చివరిసారి 1891 జూన్‌ 16న ఆ నెలకు సంబంధించి రోజువారీ అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది.

దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని రీతిలో జల సంక్షోభాన్ని బెంగళూరు ఇటీవల ఎదుర్కొంది. నీటివృథాపై అధికారులు జరిమానాలు కూడా విధించారు. ఈ క్రమంలోనే నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని, దక్షిణ కన్నడ, ఉడిపి, హవేరి, బళ్లారి, బెంగళూరు, మైసూరు తదితర జిల్లాలకు యెల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన పరిస్థితులను ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on