Tonga volcano: టోంగా అగ్నిపర్వతం విస్ఫోటం.. సముద్రంలో మహా బీభత్సం.. వీడియో.
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగున ఉన్న హుంగా టోంగా-హుంగా హాపై అగ్నిపర్వతం ఏడాది క్రితం 2022 జనవరి 15న విస్ఫోటం చెందింది. టోంగా అగ్నిపర్వత విస్ఫోటం ఒక రికార్డు సృష్టించిందని తాజా పరిశోధన తేల్చింది. దీనివల్ల చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా నీటి అడుగున అగ్నిపర్వత ప్రవాహాలు దూసుకెళ్లాయని తెలిపింది. దానివల్ల సాగరగర్భంలో రెండు టెలికాం కేబుళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పింది.
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగున ఉన్న హుంగా టోంగా-హుంగా హాపై అగ్నిపర్వతం ఏడాది క్రితం 2022 జనవరి 15న విస్ఫోటం చెందింది. టోంగా అగ్నిపర్వత విస్ఫోటం ఒక రికార్డు సృష్టించిందని తాజా పరిశోధన తేల్చింది. దీనివల్ల చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా నీటి అడుగున అగ్నిపర్వత ప్రవాహాలు దూసుకెళ్లాయని తెలిపింది. దానివల్ల సాగరగర్భంలో రెండు టెలికాం కేబుళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పింది. బద్దలైన అగ్నిపర్వత విస్పోటం జపాన్‌లోని హిరోషిమాపై పడిన అణుబాంబు కంటే వందల రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసినట్లు నాసా శాస్త్రవేత్తలు అప్పట్లో తెలిపారు. దీని ధాటికి సమీపంలోని టోంగా అనే ద్వీప దేశం అతలాకుతలమైంది. దీనివల్ల అగ్నిపర్వత పదార్థాలు ఆకాశంలో 57 కిలోమీటర్ల వరకు ఎగిసిపడ్డాయి. అవి తిరిగి మహాసముద్రంలోకి వచ్చిపడటం వల్ల కొండచరియలు విరిగిపడటం లాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ఫలితంగా సముద్రగర్భంలో వేడి లావా, బూడిద, వాయువులు గంటకు 122 కిలోమీటర్ల వేగంతో నీట్లో దూసుకెళ్లాయి. గతంలో నమోదైన వేగంతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. దీనివల్ల 80 కిలోమీటర్ల దూరంలోని కమ్యూనికేషన్ కేబుళ్లు దెబ్బతిన్నాయి. పేలుడు వల్ల సముద్రగర్భంలో 850 మీటర్ల మేర భారీ బిలం కూడా ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..