Theft: బోధన్ మున్సిపల్ ఉద్యోగి ఇంట్లో చోరీ.. ప్రిడ్జిలో పెట్టిన కీలో టామాట‌లు దోపిడి.

|

Jul 18, 2023 | 8:07 AM

ప్రస్తుతం మార్కెట్‌లో టమాటాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వీటి చోరీల ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఇంత‌కు మించిన సంఘ‌ట‌న చోటుచేసుకుంది.. బోధన్ మున్సిపాల్ ఉద్యోగి ర‌ఫి ఇంట్లో చోరి జ‌రిగింది.

ప్రస్తుతం మార్కెట్‌లో టమాటాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వీటి చోరీల ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఇంత‌కు మించిన సంఘ‌ట‌న చోటుచేసుకుంది.. బోధన్ మున్సిపాల్ ఉద్యోగి ర‌ఫి ఇంట్లో చోరి జ‌రిగింది. గౌడ్స్ కాల‌నీలో నివాసముండే ర‌ఫి కుటుంబ స‌భ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి సిద్దిపేట వెళ్లారు.. తిరిగి వచ్చేసరికి ఇళ్లంతా చిందర వందరగా పడి ఉండటంతో చోరీకి గురైనట్లు గుర్తించారు. చోరీలో 12 తులాల బంగారం తో పాటు, ల‌క్ష రూపాయల న‌గ‌దును అప‌హ‌రించారు. దీనిపై పోలిసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఇంటికి వ‌చ్చి దోంగ‌త‌నం జ‌రిగింద‌ని గుర్తించిన కుటుంబ స‌భ్యుల‌కు ఇంకో విష‌యం తెలిసి అవాక్కయ్యారు. ఊరేళ్లే ముందు ప్రిడ్జిలో పెట్టిన కీలో టామాట‌లు కూడా మాయం అవడంతో షాక్ తిన్నారు. దొంగ‌లు బంగారం, న‌గ‌దుతో పాటు టామాట‌లు కూడా వ‌దిలి పెట్టక‌పోవ‌డం అక్కడున్న వాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో పోలిసుల‌కు చేసిన పిర్యాదులో బంగారం, న‌గ‌దుతో పాటు టామాట‌లను కూడా పేర్కోన్నాడు ఇంటి ఓనర్ రఫీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...