అమ్మ బాబోయ్..! అరటి పండు కూడానా.. సెంచరీ కొట్టింది
నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడిప్పుడే దిగివచ్చి కిలో టమాటా 50 రూపాయలు పలుకుతోంది. మార్కెట్లలోకి టమాటా సరఫరా పెరగడంతో.. వాటి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మిర్చి, పసుపు, అల్లం ధరలు ఆకాశంలోనే విహరిస్తున్నాయి. తాజా వాటి జాబితాలోకి అరటి పండ్లు కూడా చేరిపోయాయి. ఇప్పుడిప్పుడు ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గుతుండగా.. అరటి పండ్ల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. బెంగళూరులో కేజీ అరటి పండ్ల ధర 100రూపాయలకు చేరింది.
నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడిప్పుడే దిగివచ్చి కిలో టమాటా 50 రూపాయలు పలుకుతోంది. మార్కెట్లలోకి టమాటా సరఫరా పెరగడంతో.. వాటి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మిర్చి, పసుపు, అల్లం ధరలు ఆకాశంలోనే విహరిస్తున్నాయి. తాజా వాటి జాబితాలోకి అరటి పండ్లు కూడా చేరిపోయాయి. ఇప్పుడిప్పుడు ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గుతుండగా.. అరటి పండ్ల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. బెంగళూరులో కేజీ అరటి పండ్ల ధర 100రూపాయలకు చేరింది. అరటి పండ్ల ధరలు పెరగడంతో.. కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. రైతుల నుంచి అరటి పండ్ల సరఫరా తగినంతగా లేకపోవడంతో.. ఆ పండ్లకు డిమాండ్ పెరిగిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. బెంగళూరులో విక్రయించే అరటి పండ్లలో మెజారిటీ వాటా తమిళనాడు రాష్ట్రం నుంచే వస్తాయి. ఎలక్కిబలే, పచ్‌బలే రకాలను బెంగళూరు వాసులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకు వాటికి గిరాకీ ఉంటుంది. అయితే తమిళనాడు నుంచి ఈ రకం పండ్ల సరఫరా తగ్గిపోయింది. నెల రోజుల క్రితం బిన్నీపేట్ మార్కెట్‌కు 1500 క్వింటాళ్ల ఎలక్కిబలే సరకు వస్తే.. ప్రస్తుతం అది వెయ్యి క్వింటాళ్లకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దోమను చంపబోయి ఆస్పత్రిలో పడ్డ వ్యక్తి !!
బ్రతకదు అనుకున్న భార్యకు ప్రాణం పోసిన భర్త
పుష్పాను మరిపించే రియల్ సీన్.. ఆ ఒక్కటి తప్పా.. అంతా సేమ్ టూ సేమ్
స్కూల్ కింద 2వేల బాంబులు.. జస్ట్ మిస్.. లేదంటే ??
జిమ్‌లో విరాట్ కోహ్లీ వర్కవుట్స్ చూస్తే అదిరిపడతారు