Tirumala Hundi: శ్రీవారికి కాసుల వర్షం.. ఒక్క నెలలోనే హుండీ ఆదాయం రూ 125.35 కోట్లు.!

|

Aug 05, 2024 | 10:13 AM

తిరుమలేశుడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 670 కోట్ల రూపాయిలకు చేరిన తిరుమల వెంకన్న ఆదాయం జూలై నెల లో 125.35 కోట్లు జమైంది. ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. భక్తకోటి కానుకలు.. తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతున్నాయి. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం..

తిరుమలేశుడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 670 కోట్ల రూపాయిలకు చేరిన తిరుమల వెంకన్న ఆదాయం జూలై నెల లో 125.35 కోట్లు జమైంది. ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. భక్తకోటి కానుకలు.. తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతున్నాయి. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం 670.21 కోట్లుగా శ్రీవారి ఖజానాకు చేరింది. ఈ ఏడాది జనవరిలో 116.46 కోట్లు, ఫిబ్రవరిలో 111.71 కోట్లు, మార్చి నెలలో 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో 101. 63 కోట్లు, మే నెలలో 108.28 కోట్లు, జూన్ నెలలో 113.64 కోట్లు హుండీ కానుకలుగా శ్రీవారి ఆదాయం ఖాతాకు చేరింది.

తిరుమల అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన టిటిడి ఈఓ శ్యామలరావు జూలై నెల వివరాలను ప్రకటించారు. తమిళనాడులోని తిరుత్తణిలో టీటీడీ భూమి అన్యాక్రాంతంపై చర్యలు తీసుకుంటామన్నారు. గత జూలై నెలలో శ్రీవారిని 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. కోటి 4 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు తెలిపారు. 24.04 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని..8.67 లక్షల మంది భక్తులు తలనీలలు సమర్పించారన్నారు.

మరో వైపు శ్రీవాణి ట్రస్టు టికెట్లను కుదించిన టిటిడి…. అన్నప్రసాదంలో భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. అన్నప్రసాదంలో యంత్రాలను త్వరలోనే మార్చుతున్నట్లు ప్రకటించారు ఈఓ శ్యామల రావు. తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో ల్యాబ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. దళారీలను అరికట్టడంలో భాగంగా పదే పదే టిక్కెట్లు పొందుతున్న 40వేల మంది ఐడిలను బ్లాక్ చేశామని…. తిరుమలలోని హోటల్ నిర్వాహకులకు నిపుణుల చేత ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు ఈఓ. ప్రసాదాల తయారీకి నాణ్యమైన నెయ్యిని వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బైట్, టీటీడీ ఈవో శ్యామలరావు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on