Indigo Flight: ఢీకొట్టిన రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం.!
కోల్‌కతాలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొట్టిన ఘటన బుధవారం కోల్‌కతా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని సంస్థ ప్రతినిధి తెలిపారు. అప్పుడే ల్యాండైన ఇండిగో విమానం పార్కింగ్ కోసం వస్తున్న సమయంలో ఎయిర్ ఇండియా విమానం రెక్కలను తాకుతూ వెళ్లిందని అన్నారు.
కోల్‌కతాలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొట్టిన ఘటన బుధవారం కోల్‌కతా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని సంస్థ ప్రతినిధి తెలిపారు. అప్పుడే ల్యాండైన ఇండిగో విమానం పార్కింగ్ కోసం వస్తున్న సమయంలో ఎయిర్ ఇండియా విమానం రెక్కలను తాకుతూ వెళ్లిందని అన్నారు. ఘటన తరువాత విమానానికి అదనపు తనిఖీలు నిర్వహించామని, ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో నిలిపి ఉంచిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఇండిగో విమానం ఢీకొట్టిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించింది. ఘటనకు కారణమైన ఇండిగో విమాన పైలట్లను తాత్కాలికంగా విధులకు దూరం చేసింది. ప్రమాద సమయంలో ఇండిగో విమానం ఎడమవైపు ఉన్న రెక్క విరిగిపోయింది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కుడివైపు ఉన్న రెక్క వంగింది. ఘటన నేపథ్యంలో కోల్‌కతా, దర్భంగా మధ్య ఇండిగో ఫ్లైట్ 6E 6152 ఆలస్యంగా ప్రయాణించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.