వామ్మో.. బాత్రూమ్ సైజ్ గదికి అద్దె రూ. 62 వేలు వీడియో

Updated on: May 06, 2025 | 5:14 PM

మన దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఇంటి అద్దెలు ఎలా ఉంటాయో మనకి తెలుసు. ఇల్లు ఇరుకైనా.. అద్దె మాత్రం పెద్ద మొత్తంలో ఉంటుంది. చెప్పాలంటే వచ్చే జీతంలో సగం ఇంటి రెంట్ కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పబోయేది ఇండియాలోని నగరాల్లో ఇళ్ల కిరాయిల గురించి కాదు. దుబాయ్‌లో ఓ చిన్న గది అద్దెకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రకటన గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. బాత్రూమ్ సైజు ఉన్న ఆ చిన్న గది అద్దె ఏకంగా రూ. 62 వేలు. షాకింగ్‌గా ఉంది కదా.. కానీ, నిజమే!

దుబాయ్‌లోని ఖరీదైన మారినా ప్రాంతంలో ఒక చిన్న పార్టిషన్ గది అద్దెకు ఇవ్వనున్నట్లు నెసన్ సర్వీసెస్ అనే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. బాల్కనీతో కూడిన ఈ గదికి నెలకు అద్దె 2,700 దర్హామ్‌లు అంటే మన కరెన్సీలో 62,000గా నిర్ణయించారు. అలాగే, ముందుగా 11,600 రూపాయలు డిపాజిట్‌ చేయాలని, కేవలం అమ్మాయిలకు మాత్రమే అని ప్రకటనలో తెలిపారు. ఇలాంటి కండిషన్స్ మన దగ్గర కూడా చూశాం కాబట్టి మాములుగానే అనిపిస్తుంది. అయితే, ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఆ గదిలో కేవలం ఒక మంచం, ఒక అలమారా మాత్రమే పెట్టగలిగేంత స్థలం ఉంది. ఇంత చిన్న గదికి అంత అద్దె ఉండటం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దుబాయ్‌లో పార్టిషన్ గదులు అంటే అపార్ట్‌మెంట్‌లలో తాత్కాలిక గోడలతో విభజించి చిన్న గదులుగా ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కొంతమంది బెంగళూరు, ముంబై వంటి నగరాలతో పోల్చుతూ ఖర్చులపై వ్యంగ్యంగా స్పందించారు. మరికొందరు ‘నా బాల్కనీ ఇంతకంటే పెద్దగా ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, తాజాగా దుబాయ్‌లో Real-Time Rental Index ప్రవేశపెట్టిన తర్వాత నగరంలోని చాలాచోట్ల అద్దె ధరలు 8% నుంచి 15% వరకు పెరిగాయి. దీనిని ఆసరాగా తీసుకుంటూ యజమానులు భారీ అద్దె వేస్తున్నారు. ఈ ఘటన నగరాల్లో పెరుగుతున్న అద్దె ధరల వల్ల వలస వచ్చిన మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైలైట్ చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :
వాడు నావాడంటే.. నావాడు అంటూ ఓ సీఐ కోసం పోలీస్‌స్టేషన్‌లో కొట్టుకున్న మహిళలు
ఆ శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే.. అగ్ని ప్రమాదం సంభవిస్తుందా వీడియో

అడిగినంత పనీర్ వడ్డించలేదని పెళ్లి మండపంలో దారుణం వీడియో