Tiger: సర్కస్‌లో ప్రదర్శన ఇస్తుండగా సడన్ షాక్..! వెన్నులో వణుకు పుట్టే వీడియో.. తప్పక చూడాల్సిందే..

|

Jan 13, 2023 | 7:58 PM

సాధారణంగా పులులు మీదైనా దాడి చేస్తే వాటిని ట్రైనర్ లే నియంత్రిస్తారు. కానీ ఓ సర్కస్ ట్రైనర్ పై పులి ఒక్కసారిగా దాడి చేసి ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇటలీలో లెక్సే ప్రావిన్స్‌లోని మెరినా ఓర్ఫీ సర్కస్‌లో ఇవాన్‌ ఓర్ఫీ అనే 31 ఏళ్ల వ్యక్తి పులులకు ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. కాగా సర్కస్‌లో రెండు పులులతో ప్రదర్శన ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కపులిపైనే తన ఫోకస్‌ పెట్టాడు. బోనులోఉన్న పులితో విన్యాసాలు చేయిస్తున్నాడు. అదే సమయంలో మరో పులి వచ్చి ట్రైనర్ కాలునిగట్టిగా పట్టేసుకుంది. దీంతో ట్రైనర్ పెనుగులాడుతూ కిందపడిపోయాడు. అనంతరం ఆ ట్రైనర్ వెనక నుంచి పులి దాడి చేసింది. అతడి మెడను నోటితో పట్టేసింది. నొప్పితో అతడు విలవిల్లాడిపోయాడు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ప్రేక్షకులు అందరూ భయంతో కేకలు వేశారు. కాగా బాధితుడిని పులి బారి నుంచి మరో ట్రైనర్ రక్షించాడు. అనంతరం ఇవాన్ ఓర్ఫీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇవాన్ ఓర్ఫీ చాలా నైపుణ్యాలు ఉన్న ట్రైనర్ అయినప్పటికీ పులి బారిన పడ్డాడని సర్కర్ ప్రతినిధులు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 13, 2023 07:58 PM