మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే

Updated on: Dec 29, 2025 | 12:35 PM

కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుల వలలకు అరుదైన థ్రెషర్ షార్క్ చేపలు చిక్కాయి. లోతైన జలాల్లో నివసించే ఈ చేపలు పొడవైన తోకతో ప్రత్యేకంగా ఉంటాయి. వీటి కాలేయం నుండి నూనె, చర్మం మరియు రెక్కల నుండి సూప్ తయారవుతుంది. కోల్ కతాకు ఎగుమతై వేలల్లో ధర పలికే ఈ చేపలు, అరుదుగా కనిపించి మత్స్యకారులకు లాభాలను తెస్తున్నాయి.

సముద్రంలో రకరకాల జీవులు ఉంటాయి. వాటిలో ఎన్నో అరుదైన చేపలు కూడా ఉంటాయి. భారీ తిమింగలాలు, షార్క్‌లు లాంటి పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి. ఇటీవల విశాఖ సముద్ర తీరానికి భారీ తిమింగలాలు కొట్టుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఒక్కోసారి మత్స్యకారుల వలలకు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. తాజాగా కాకినాడ సముద్రంలో థ్రెషర్‌ షార్క్‌ చేపలు చిక్కాయి. థ్రెషర్ షార్క్ చేపలు చాలా అరదుగా కనిపిస్తుంటాయి. కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుల వలలకు థ్రెషర్ షార్క్ చేపలు చిక్కాయి. ‘ఇవి సముద్ర జలాల్లో లోతైన ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అరుదుగా కనిపిస్తూ మత్స్యకారుల వలలకు చిక్కుతూ ఉంటాయి . పొడవైన తోక వీటి ప్రత్యేకత. వీటి లివర్ నుంచి ఆయిల్ తీస్తారు. చర్మం, రెక్కలను సూప్ తయారీకి వాడతారని మత్స్యశాఖ అధికారులు తెలియజేశారు. వీటిని ఎక్కువగా కోల్ కతాకు ఎగుమతి చేస్తామని వ్యాపారులు అంటున్నారు. ధర కూడా వేలల్లో ఉంటుందన్నారు మత్స్యకారులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold and Silver Price: వెండి, బంగారం పరుగులకు 3 కారణాలు

ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం