వ్యూస్‌ కోసం కొత్తగా ట్రై చేశారు.. జైలు పాలయ్యారు.. ఏం జరిగిందంటే ??

|

Sep 04, 2023 | 9:00 PM

యూట్యూబ్ చానల్ వ్యూస్ పెంచుకోవడం కోసం కొత్త రకం ఆలోచన చేసిన యువకులు జైలు పాలయ్యారు. వారి ప్లాన్‌ కాస్త బెడిసి కొట్టడంతో వైల్డ్ లైఫ్ కేసులో బుక్ అయ్యి రిమాండ్ కు వెళ్ళిన ఘటన ములుగు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ములుగు మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు విలేజ్ థింగ్స్‌ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టారు. చిన్న చిన్న వీడియోలను అందులో అప్లోడ్ చేస్తూ వీవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.

యూట్యూబ్ చానల్ వ్యూస్ పెంచుకోవడం కోసం కొత్త రకం ఆలోచన చేసిన యువకులు జైలు పాలయ్యారు. వారి ప్లాన్‌ కాస్త బెడిసి కొట్టడంతో వైల్డ్ లైఫ్ కేసులో బుక్ అయ్యి రిమాండ్ కు వెళ్ళిన ఘటన ములుగు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ములుగు మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు విలేజ్ థింగ్స్‌ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టారు. చిన్న చిన్న వీడియోలను అందులో అప్లోడ్ చేస్తూ వీవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. వ్యూస్ రాకపోవడంతో ఎలాగైనా సక్సెస్‌ అవ్వాలనుకున్న ఆ యువకులు ఈసారి కొత్తగా ప్లాన్‌ చేశారు. అడవిలో వేటకు సంబంధించిన వీడియో చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని ఆలోచించారు. అనుకున్నదే తరువుగా అడపలతో వేట-ఇది మా ప్రాచీన పద్ధతి అనే టైటిల్‌తో అడపలతో అడవి కోళ్లను వేటాడం ఎలా అనే వీడియో తీశారు. వీడియోలో అడపలతో ఉచ్చును బిగించి అందులో అడవి కోడి ఒకటి పడినట్టు, దాన్ని చంపి కాల్చి తింటున్నట్టు వీడియో తీసి వారి యూట్యూబ్ ఛానల్ లో 8 నవంబర్ 2022 లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువ రాకపోగా అది కాస్త ఫారెస్ట్ ఆఫీసర్ల కంట పడింది. ఆ వీడియోలో ఉన్న ముగ్గురు యువకులపై ఫారెస్ట్, పోలీసులు వైల్డ్ లైఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిలాడీ లేడీల లూటీ స్కెచ్.. సీసీ కెమెరాకు చిక్కి కటకటాల పాలు

బెండ రైతు ఆవేదన.. టన్నుల కొద్దీ బెండకాయలు నీటిపాలు..

అర్ధరాత్రి ఇంటి ప్రాంగణంలో నాగుపాము హల్‌చల్‌ !! చివరికి ??

కెమెరాలో బంధించిన అండర్‌ వాటర్‌ ఫొటోగ్రాఫర్‌ !! వికృత ముఖంతో దెయ్యం చేప

‘స్పైడర్ మ్యాన్’గా మారి బిల్డింగ్‌ ఎక్కిన యువకుడు