Viral Video: కరోనా నిబంధనలు పాటిస్తూ.. బాలుడు ఓ రేంజ్‌లో డ్యాన్స్.. టాలెంట్‌కు ఫిదా అంటున్న నెటిజన్లు

|

Jul 20, 2021 | 7:08 PM

Little Boy Dance Viral Video: కళ ఏ ఒక్కరి సొంతం కాదు.. డ్యాన్స్, సంగీతం , చిత్రలేఖనం ఇలాంటి కళలు ఆ మనిషికి దేవుడిచ్చిన వరం. అయితే ఆ కళ ఉన్న కొందరు వెలుగులోకి వచ్చి...

Viral Video: కరోనా నిబంధనలు పాటిస్తూ.. బాలుడు ఓ రేంజ్‌లో డ్యాన్స్.. టాలెంట్‌కు  ఫిదా అంటున్న నెటిజన్లు
Little Boy Dance
Follow us on

Little Boy Dance Viral Video: కళ ఏ ఒక్కరి సొంతం కాదు.. డ్యాన్స్, సంగీతం , చిత్రలేఖనం ఇలాంటి కళలు ఆ మనిషికి దేవుడిచ్చిన వరం. అయితే ఆ కళ ఉన్న కొందరు వెలుగులోకి వచ్చి.. తమకంటూ ఓ పేరు సంపాదించుకుంటే.. మరికొందరు మట్టిలో మాణిక్యాల్లా మరుగున పడిపోతున్నారు. అయితే సోషల్ మీడియా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక మంది కళాకారులూ వెలుగులోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ చిన్న పిల్లవాడు ఒక వీధిలో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నెటిజన్లు ఆ బాలుడి డ్యాన్స్ ప్రతిభకు ఫిదా..

వర్షం తగ్గిన తర్వాత ఏర్పడిన బురదలో ఒక వ్యక్తి డప్పు కొడుతుంటే.. దానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నాడు ఆ చిన్న బాలుడు. ఈ వీడియో ఒక ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ “హ్యాండిల్‌ విత్ ది క్యాప్షన్‌” పేరు తో షేర్ చేశారు. ఇటువంటి డ్యాన్స్ ను ఇప్పటి వరకూ ఎవరూ చూడలేదు.. ఎవరూ బాధపడని ప్రేమ, ఎవరూ వినని పాట , భూమి మీద స్వరం అనే విధంగా జీవించండి అంటూ ఆ వీడియో కి కొటేషన్ కూడా జత చేశారు.

కరోనా నేపధ్యం లో మాస్క్ వేసుకున్న ఓ మూడేళ్ళ బాలుడు బురద నీటిలో కాళ్లకు చెప్పులు లేకుండా డ్యాన్స్ ను ఎంతో ఇష్టంగా చేస్తున్నాడు. డప్పుకి అనుగుణంగా స్టెప్స్ వేస్తున్న చిన్నారి ప్రతిభ చూపరులను ఆకట్టుకుంది. ఈ వీడియో . మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. వేలాది లైక్స్, రీ ట్విట్స్ తో..  ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదు అంటూ చక్కర్లు కొడుతోంది.

 

Also Read:  Leggings-StyleTips: లెగ్గింగ్స్ కొంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటిస్తే.. అందానికి అందం..సౌకర్యానికి సౌకర్యం