Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఊరి గుడిలో పంచలోహ విగ్రహాలు ఉన్నాయా.. అయితే జాగ్రత్త

మీ ఊరి గుడిలో పంచలోహ విగ్రహాలు ఉన్నాయా.. అయితే జాగ్రత్త

Phani CH
|

Updated on: Jun 28, 2025 | 11:40 AM

Share

మీ ఊళ్ళో గుళ్ళల్లో పంచలోహ విగ్రహాలు ఉన్నాయా. అయితే జాగ్రత్త! వాళ్ల కంటపడ్డాయో అంతే సంగతులు. భక్తులకు మూల విరాట్టు ముఖ్యం కానీ దొంగలకు మాత్రం పంచలోహ విగ్రహాలే టార్గెట్‌. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో వీటి కాలాన్ని బట్టి కోట్ల రూపాయల్లో ధరలు పలుకుతాయి. ఈ పంచలోహ విగ్రహాలను ఎంత నగిషీగా చెక్కితే అంత ప్రాధాన్యత లభిస్తుంది.

కొన్ని పంచలోహ విగ్రహాలకు రైస్‌ పుల్లింగ్‌, ఇతర దైవిక శక్తులు ఉంటాయని నమ్మడం వల్లే వీటికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పెరిగింది. మరీ ముఖ్యంగా భారతదేశంలో తయారు చేసిన అతి ప్రాచీన పంచలోహ విగ్రహాలకు ఎక్కడ లేని గిరాకీ ఉంటుంది. అందుకే దొంగల దృష్టి ఎప్పుడూ వీటిపైనే ఉంటుంది. ఈ పంచలోహ విగ్రహాలపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు తాజాగా ప్రకాశంజిల్లాలో దర్శనమిచ్చారు. కుంభం మండలం తెల్లదిన్నే గ్రామంలోని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కోదండ రామస్వామి ఆలయంలోకి చొరబడి వందేళ్ళ క్రితం ప్రతిష్టించిన సీతా, రామ సేమేత లక్ష్మణ విగ్రహాలను ఎత్తుకెళ్ళారు. ఆంజనేయస్వామి విగ్రహం ఇత్తడిది కావడంతో ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. చిన్న దేవాలయం కావడం, ఊరికి కొద్ది దూరంలో ఉండటంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీన్ని గమనించిన పూజారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. క్లూస్ టీంని రంగంలోకి దించి వేలిముద్రలు సేకరించారు. దొంగలను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని సీఐ మల్లికార్జున తెలిపారు. దేవతా విగ్రహాలను తయారు చేయడానికి బంగారం, వెండి, రాగి, ఇనుము, జింక్ ఇలా ఐదు లోహాలను ఉపయోగిస్తారు. ఈ పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలను హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఇలా తయారు చేసిన విగ్రహాల్లో దైవిక శక్తులు ఉంటాయని నమ్ముతారు. మూల విరాట్ తర్వాత ఈ విగ్రహాలను పూజించే వారికి దేవతల అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. ఈ విగ్రహాలను కలిగి ఉండటం వల్ల జీవితంలో సమతుల్యత, ఆత్మవిశ్వాసం, అదృష్టం, ఆరోగ్యం, శ్రేయస్సు, మనశ్శాంతి లభిస్తుందని పండితులు చెబుతారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

EPFO సభ్యులకు శుభవార్త..ఆటో సెటిల్మెంట్‌ విత్‌డ్రా రూ.5 లక్షలకు పెంపు

ప్రపంచంలోనే బుల్లి కారు.. దీని జోరే వేరు

తామరాకుని ఇలా కూడా వాడతారా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

52 ఏళ్లుగా దాన్ని కడుపులో దాచుకున్నావ్ మావా.. ఆశ్చర్య పోయిన వైద్యులు

కుమార్తెలపై కోపంతో రూ.4 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఆలయం హుండీలో వేసిన తండ్రి