వీడెవడండీ బాబు !! లాకర్‌ ముందు పూజ చేసి మరీ బ్యాంకు మొత్తం దోచేశాడు !!

|

May 28, 2022 | 9:21 AM

కేరళలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. కొల్లాంలోని ఓ బ్యాంకులో దొంగలు పడ్డారు. ఈ క్రమంలో వారు తమ దొంగతనం విజయవంతం కావాలని పూజలు చేసి మరీ లాకర్‌ ఓపెన్‌ చేసారు.

కేరళలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. కొల్లాంలోని ఓ బ్యాంకులో దొంగలు పడ్డారు. ఈ క్రమంలో వారు తమ దొంగతనం విజయవంతం కావాలని పూజలు చేసి మరీ లాకర్‌ ఓపెన్‌ చేసారు. లాకర్‌ ముందు పూలు, తమలపాకులు, నైవేద్యంగా మద్యం ఉంచి చక్కగా పూజలు చేసి అనంతరం 30 లక్షల విలువైన నగలు, 4 లక్షల నగదుతో ఉడాయించారు. పాతనాపురంలోని జనతా జంక్షన్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థ పతనపురం బ్యాంకర్స్‌లో ఈ ఘటన జరిగింది. మే 16వ తేదీన తమ సంస్థలో దొంగలు పడ్డారని యజమాని రామచంద్రన్ నాయర్ ప్రకటించారు. ఉదయం 9 గంటలకు ఆయన బ్యాంకుకు వెళ్లగా బ్యాంకులో చోరీ జరిగినట్టుగా గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…పరిసరాలను పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరు చూసి పోలీసులు అవాక్కయ్యారు. బ్యాంకు లాకర్ ముందు ఆధ్యాత్మిక పూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముస్లిం పెళ్లి శుభలేఖపై హిందూ దేవుళ్లు.. వైరల్‌ అవుతున్న వెడ్డింగ్‌ కార్డు

సింహంతో సెల్ఫీ దిగు కానీ !! ఆడుకోవాలనుకుంటే ఇలాగే ఉంటది మరి

ఆ ఇంట్లో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు.. వరికో తెలిస్తే షాకవుతారు !!

 

 

Published on: May 28, 2022 09:21 AM