ముస్లిం పెళ్లి శుభలేఖపై హిందూ దేవుళ్లు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు
మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఓ ముస్లిం యువకుడి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విదిషాలోని ఆనంద్‌పూర్‌కు చెందిన ఇర్షాద్, అన్సార్‌ల వివాహం ఆదివారం జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఓ ముస్లిం యువకుడి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విదిషాలోని ఆనంద్‌పూర్‌కు చెందిన ఇర్షాద్, అన్సార్‌ల వివాహం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పెళ్లి కార్డుల ద్వారా కుటుంబ సమేతంగా ఐక్యతా సందేశాన్ని అందించారు. అన్సార్, ఇర్షాద్‌లు వివాహ ఆహ్వానపత్రికపైన హిందూ ఆరాధ్య దైవమైన గణేశుడి చిత్రాన్ని, లోపల రాధాకృష్ణుల చిత్రాన్ని ముద్రించారు. ముస్లిం యువకుడి పెళ్లిలో హిందూ దేవుళ్ల చిత్రాలను ముద్రించడంతో.. ఈ పెళ్లి కార్డులు ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారాయి. ఇది కాస్త ఇంటర్‌నెట్‌లో చేరటంతో సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతోంది.22 మే 2022న జరిగిన ఈ వివాహ కార్డులు హిందీ భాషలో ముద్రించారు. ఆహ్వాన పత్రికలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వంటి పదాలు వాడారు. ఆనంద్‌పూర్‌లో ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింహంతో సెల్ఫీ దిగు కానీ !! ఆడుకోవాలనుకుంటే ఇలాగే ఉంటది మరి
ఆ ఇంట్లో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు.. వరికో తెలిస్తే షాకవుతారు !!
Vitamin C: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. అందుకే..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

