సింహంతో  సెల్ఫీ దిగు కానీ !! ఆడుకోవాలనుకుంటే ఇలాగే ఉంటది మరి

సింహంతో సెల్ఫీ దిగు కానీ !! ఆడుకోవాలనుకుంటే ఇలాగే ఉంటది మరి

Phani CH

|

Updated on: May 28, 2022 | 9:17 AM

సింహాన్ని దగ్గర్నుంచి చూడాలంటే చూడు.. ఓ సెల్ఫీ కూడా దిగు.. కానీ దాంతో ఆడుకోవాలని మాత్రం అనుకోవద్దు.. సింహంతో పరాచకాలాడితే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

సింహాన్ని దగ్గర్నుంచి చూడాలంటే చూడు.. ఓ సెల్ఫీ కూడా దిగు.. కానీ దాంతో ఆడుకోవాలని మాత్రం అనుకోవద్దు.. సింహంతో పరాచకాలాడితే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంది. అసలేం జరిగిందంటే… వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి జూకి వెళ్లాడు. అక్కడ ఓ బోనులో సింహం ఉంది. దాన్ని చూసి ఆ వ్యక్తి కాసేపు పరాచకాలాడాడు. ఇదంతా అతని ఫ్రెండ్స్‌ పక్కనే ఉండి వీడియో తీస్తున్నారు. అతను తన చేతిని సింహం నోట్లో పెడుతూ తీస్తూ ఆటపట్టిస్తున్నాడు. సింహం కూడా మొదట కాసేపు పాజిటివ్‌గానే రియాక్టయింది. ఆ తర్వాత వీడు నన్ను తక్కువ అంచనా వేస్తున్నాడు అనుకుంది కాబోలు.. ఈసారి చెయ్యి నోట్లో పెట్టినప్పుడు అతడి చేతిని నోటితో గట్టిగా పట్టేసుకుంది. ఇంకేముంది ఎంత లాగినా విడిచిపెట్టదు. చివరకి ఆ వ్యక్తి వేలుని పోగట్టుకునే పరిస్థితి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఇంట్లో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు.. వరికో తెలిస్తే షాకవుతారు !!

Vitamin C: విటమిన్‌ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. అందుకే..

చైనాలో అద్భుతం !! భూమి లోపల దట్టమైన అడవి !! చూస్తే నివ్వెరపోతారు

 

Published on: May 28, 2022 09:17 AM