అన్ని దొంగల్లో ఈ దొంగ వేరయా.. చోరీకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు !! చివరికి ఏమైందంటే ??
ఎరక్కపోయి వచ్చారు.. ఇరుక్కుపోయారంటే ఇదే మరి. దొంతనం చేద్దామని ఓ శివాలయంలోకి చొరబడ్డారు ఇద్దరు కేటుగాళ్లు. కానీ ఊహించని విధంగా ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.
ఎరక్కపోయి వచ్చారు.. ఇరుక్కుపోయారంటే ఇదే మరి. దొంతనం చేద్దామని ఓ శివాలయంలోకి చొరబడ్డారు ఇద్దరు కేటుగాళ్లు. కానీ ఊహించని విధంగా ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. చోరీ చేయకుండానే అడ్డంగా దొరికిపోయారు. అది కూడా కాస్త విచిత్రంగా.. అందరికి నవ్వు తెప్పించేలా ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని మామిడివలసలో జరిగింది. ఇద్దరు దొంగలు చోరీ చేసేందుకు ఓ శివాలయంలోకి చొరబడ్డారు. ఎవరికి కనిపించకుండా నక్కి, నక్కి లోపలికి కూడా వచ్చారు. లైట్ ఆపేస్తే తమ పని ఇంకా సులువుగా అవుతుందని భావించారు. స్విచ్ ఆపేద్దామని బోర్డు దగ్గరకు వెళ్లారు.. తీరా స్విచ్ ఆపే సమయంలో తడబడి లైట్ స్విచ్ బదులు కాలింగ్ బెల్ స్విచ్ నొక్కారు. దీంతో కాలింగ్ బెల్ గట్టిగా మోగింది.. వెంటనే ఆలయంలో నిద్రిస్తున్న విద్యార్థులు ఉలిక్కిపడి లేచారు. దొంగలను పట్టుకునేందుకు విద్యార్థులు వెంబడించగా ఒకడు తప్పించుకోగా.. మరొకడు దొరికిపోయాడు. దీంతో స్థానికులు అతడిని స్తంభానికి కట్టేసి పోలీసులకు అప్పగించారు. అయితే చోరీకి వెళ్లి అమాయకంగా కాలింగ్ బెల్ నొక్కి దొరికిపోయిన దొంగల వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. రెండు నెలల క్రితం ఇదే శివాలయంలో దుండగులు హుండీని కాజేశారు. ఇప్పుడు మళ్లీ చోరీ ప్రయత్నం కలకలం రేపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెడికల్ షాపులో అరుదైన బల్లి.. ధర తెలిస్తే షాకే !!
పవర్ స్టార్ మనసు గెలుచుకున్న ప్రభాస్..
Bandla Ganesh: అల్లు అర్జున్ స్టార్‌డమ్‌పై బండ్ల షాకింగ్ కామెంట్స్..
Rana Daggubati: రానా కోపానికి.. దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన సంస్థ..
Megastar Chiranjeevi: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా !! నాటి జ్ఙాపకాన్ని పంచుకున్న చిరు..