మెడికల్ షాపులో అరుదైన బల్లి.. ధర తెలిస్తే షాకే !!
అంతరించిపోతున్న అరుదైన బల్లిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని ఓ మెడికల్ స్టోర్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు అరుదైన టోకే గెక్కో బల్లితో పాటు మత్తునిచ్చే దగ్గు సిరప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
అంతరించిపోతున్న అరుదైన బల్లిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని ఓ మెడికల్ స్టోర్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు అరుదైన టోకే గెక్కో బల్లితో పాటు మత్తునిచ్చే దగ్గు సిరప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇది అంతరించిపోతున్న తక్షక్ జాతికి చెందిన బల్లిగా అధికారులు వెల్లడించారు. రికవరీ చేసిన వస్తువుల మార్కెట్ విలువ దాదాపు కోటి రూపాయలుగా వెల్లడించారు. స్మగ్లింగ్ కోసం ఉపయోగించిన ట్యాక్సీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో బైసి ప్రాంతంలోని ఓ మెడికల్ స్టోర్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో అరుదైన బల్లిని స్వాధీనం చేసుకున్నారు. టోకే గెక్కో బల్లిని పశ్చిమ బెంగాల్‌లోని కరాండిఘి నుంచి బీహార్‌కు తీసుకెళ్లినట్లు ఏరియా ఎస్‌డిపిఓ ఆదిత్య కుమార్ తెలిపారు. ఈ ఘటనలో 5 మందిని అరెస్ట్ చేశారు. అయితే తక్షక్‌ను ఉంచిన దుకాణదారుని పోలీసులు పట్టుకోలేకపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవర్ స్టార్ మనసు గెలుచుకున్న ప్రభాస్..
Bandla Ganesh: అల్లు అర్జున్ స్టార్‌డమ్‌పై బండ్ల షాకింగ్ కామెంట్స్..
Rana Daggubati: రానా కోపానికి.. దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన సంస్థ..
Megastar Chiranjeevi: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా !! నాటి జ్ఙాపకాన్ని పంచుకున్న చిరు..
Mahesh Babu: మహేష్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో.. అతను ఎవరంటే ??