Viral: వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

|

Dec 28, 2024 | 7:01 PM

తమిళనాడులో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. టూ వీలర్‌ను వెంబడించి ఒకటిన్నర నిమిషాల వ్యవధిలోనే రూ.2లక్షలు కొట్టేశారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆరుగురు వ్యక్తులు వెంబడించి మరీ డబ్బులు కాజేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

అవినాశి కామరాజ్ నగర్‌కు చెందిన షణ్ముగం అనే రైతు. తన వ్యక్తిగత అవసరాల కోసం స్థానిక బ్యాంకుకు వెళ్లి రూ. 2 లక్షలు డ్రా చేసుకొని వాహనం వెనుక సీటు కింద దాచిపెట్టాడు. అనంతరం డబ్బులతో అదే ప్రాంతంలోని ఓ దుకాణం సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆపి లోపలికి వెళ్లాడు. అప్పటి వరకూ అతనని ఓ ఆరుగురు దుండగులు మూడు ద్విచక్ర వాహనాలపై వెంబడిస్తూ వచ్చారు. అది షణ్ముగం గమనించలేదు. షాపు వద్ద తన బైకు పార్క్‌ చేసి దుకాణంలోకి వెళ్లగానే దొంగలు తమ పని కానిచ్చేశారు. షణ్ముగం బైకు వెను సీటు తాళం పగలగొట్టి అందులో ఉంచిన రూ.2 లక్షల రూపాయలు ఎత్తుకొని వెళ్లిపోయారు. దుకాణంలోనుంచి బయటకు వచ్చిన షణ్ముగం తన వాహనం వెనుక సీటు పగలగొట్టి ఉండటంతో కంగారు పడ్డాడు. సీటు లోపల చూశాడు. డబ్బు కనిపించలేదు. ఎవరో బైకు సీటు పగలగొట్టి తన డబ్బు కొట్టేశారని గ్రహించి లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి సీసీ కెమెరా పుటేజీని పరిశలించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.