ప్రపంచంలోని 50 ఉత్తమ వంటకాల్లో 9 భారతీయ వంటకాలు
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ ఇప్పటికే పలుమార్లు భారతీయ వంటకాలకు ఫిదా అయింది. ఎన్నో రకాల డిషెస్, డ్రింక్స్ కు వివిధ కేటగిరీల్లో తమ వెబ్ సైట్ లో స్థానం కల్పించింది. అయితే తాజాగా ఆ సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే.. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో ఆ వెబ్ సైట్ రూపొందించిన జాబితాలో ఏకంగా 9 భారతీయ వంటకాలకు చోటు లభించింది
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ ఇప్పటికే పలుమార్లు భారతీయ వంటకాలకు ఫిదా అయింది. ఎన్నో రకాల డిషెస్, డ్రింక్స్ కు వివిధ కేటగిరీల్లో తమ వెబ్ సైట్ లో స్థానం కల్పించింది. అయితే తాజాగా ఆ సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే.. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో ఆ వెబ్ సైట్ రూపొందించిన జాబితాలో ఏకంగా 9 భారతీయ వంటకాలకు చోటు లభించింది. ఎప్పటికీ పాపులర్ డిష్ అయిన కీమా ఈ లిస్ట్ లో టాప్ టెన్ లో నిలిచి, 6వ స్థానం సంపాదించింది. అలాగే బెంగాల్ వాసులు తయారు చేసే చింగ్రీ మలాయ్ కర్రీ 18వ స్థానం సంపాదించింది. ఇక కుర్మాకు 22వ ర్యాంకు లభించింది. ఆ తర్వాత విందాలూ 26వ ర్యాంక్, దాల్ తడ్కా 30వ ర్యాంక్, సాగ్ పన్నీర్ 32, షాహీ పన్నీర్ 34, మిసాల్ 38వ ర్యాంక్ పొందాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పర్వతం కనిపించకుండా భారీగా నల్లటి తెర !! ఎందుకంటే ??