Variety Thieves: వీడు మామూలోడు కాద.. బ్లాక్ బోర్డుపై కారణాలు రాసి.. మరీ దొంగతనం.

Variety Thieves: వీడు మామూలోడు కాద.. బ్లాక్ బోర్డుపై కారణాలు రాసి.. మరీ దొంగతనం.

Anil kumar poka

|

Updated on: Jan 06, 2024 | 9:24 AM

సాధారణంగా దొంగతనం చేస్తే ఎలాంటి అధారాలు వదలకుండా వెళ్తారు దొంగలు. అందుకోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతుంటారు. కానీ నాగర్ కర్నూల్ జిల్లాలో చోరి చేయడమే కాకుండా తాము ఎందుకు చేశామో కారణం సైతం రాసి వెళ్లారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజిలోని ప్రాక్టికల్స్ సామాగ్రికి సంబంధించిన గదిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాపర్ వైర్లను చోరీ చేశారు. వివిధ గదుల్లో ఉండే సీలింగ్ ఫ్యాన్లను తీసేసి, అందులోని కాపర్ వైర్లను దొంగిలించారు.

సాధారణంగా దొంగతనం చేస్తే ఎలాంటి అధారాలు వదలకుండా వెళ్తారు దొంగలు. అందుకోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతుంటారు. కానీ నాగర్ కర్నూల్ జిల్లాలో చోరి చేయడమే కాకుండా తాము ఎందుకు చేశామో కారణం సైతం రాసి వెళ్లారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజిలోని ప్రాక్టికల్స్ సామాగ్రికి సంబంధించిన గదిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాపర్ వైర్లను చోరీ చేశారు. వివిధ గదుల్లో ఉండే సీలింగ్ ఫ్యాన్లను తీసేసి, అందులోని కాపర్ వైర్లను దొంగిలించారు. అనంతరం ఈ ఫ్యాన్లను తగులబెట్టారు. అయితే దొంగతనం చేయడం వరకు సరే.. తాము దొంగతనం ఎందుకు చేశామో అని క్లాస్ రూమ్ లో ఉన్న బ్లాక్ బోర్డ్ పై రాసి వెళ్లారు ఈ చోరకళాకారులు.

“మా అవసరాల కోసమే ఈ పాఠశాలలోని ఎలక్ట్రిక్ వైర్లను దొంగిలించాం.. మిగిలిన భాగాలన్ని మీకే.. మమ్మల్నీ మన్నించండి” అంటూ రాసి వెళ్లారు. దీంతో పాటుగా “సలార్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి” అంటూ ఈ దొంగలు ఉచిత సలహాను సైతం ఇచ్చి వెళ్లారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరి చేసింది జిల్లా కేంద్రానికి చెందిన అకతాయిల పనే అయిఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ వద్ద పర్యవేక్షణ తక్కువగా ఉండడాన్ని అసరాగా చేసుకొని ఈ రకంగా చోరికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.