Smart Work Video: స్మార్ట్‌ వర్క్‌..అంటే ఇదేమరీ! చూస్తే అవాక్కే..! కండ బలం కంటే బుద్ధి బలమే గొప్పదని చెబుతున్న వీడియో.

|

Sep 19, 2021 | 3:59 PM

హార్డ్‌ వర్క్‌ కాదు.. స్మార్ట్‌ వర్క్‌ చేయాలని చెబుతుంటారు. గంటల తరబడి చేసే శారీరక శ్రమతో చేసే పనిని కూడా స్మార్ట్‌ ఆలోచనతో చాలా ఈజీగా చేయొచ్చు. దీనివల్ల పని వేగంగా జరగడంతో పాటు కచ్చితత్త్వంతో జరుగుతుంది. దీనికి ఎన్నో ఉదాహరణాలున్నాయి. అయితే తాజాగా...

హార్డ్‌ వర్క్‌ కాదు.. స్మార్ట్‌ వర్క్‌ చేయాలని చెబుతుంటారు. గంటల తరబడి చేసే శారీరక శ్రమతో చేసే పనిని కూడా స్మార్ట్‌ ఆలోచనతో చాలా ఈజీగా చేయొచ్చు. దీనివల్ల పని వేగంగా జరగడంతో పాటు కచ్చితత్త్వంతో జరుగుతుంది. దీనికి ఎన్నో ఉదాహరణాలున్నాయి. అయితే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియో దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.

ఓ అడవిలో చెట్లను నరికిన తర్వాత దుంగలను లారీలోకి ఎక్కించాల్సి వచ్చింది. అయితే సహజంగా భుజాలపై లేదా చేతులతో మోస్తూ వాటిని తరలిస్తుంటారు. కానీ కొందరు కూలీలు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించారు. హార్డ్‌ వర్క్‌ను కాకుండా స్మార్ట్‌ వర్క్‌ను నమ్ముకున్నారు. పెద్ద పెద్ద దుంగలను సింపుల్‌గా లారీలోకి ఎక్కించడానికి ముందుగా లారీపై నుంచి కింది వరకు రెండు పెద్ద కర్రలను అమర్చారు. అనంతరం ఆ దుంగకు తాడును జోడించి రెండు కర్రలపై నుంచి పైకి లాగడం ప్రారంభించారు. సుమారు 100 కిలోలకు పైగా ఉండే ఆ దుంగలను ఈ ట్రిక్‌తో సింపుల్‌గా లారీలోకి ఎక్కించారు.ఈ వీడియోను తేజాన్‌ శేఖర్‌ అనే ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కార్మికు స్మార్ట్‌ వర్క్‌ను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ‘వాట్‌ ఏ ఐడియా సర్‌ జీ’, ‘టీమ్‌ వర్క్‌తో ఏదైనా సాధించవచ్చు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Copy cat viral video: నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న కాపీక్యాట్‌ ఫన్నీ సీన్స్‌.. వీడియో తీసిన మహిళ..

 Gopireddy Srinivasa Reddy: చెత్త నా….. సీఎంని పట్టుకుని అంతమాటంటారా..? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్(వీడియో)

 Pak Supports Taliban : పాకిస్తాన్‌ చెవుల్లో అమృతం.. తాలిబన్లతో పాక్‌ గాఢానుబంధం..(వీడియో)

 Car In Flood Viral Video: వరద నీటిలో కారు ప్రయాణం.. ఆశ్చర్యపోయానన్న ఆనంద్‌ మహీంద్ర..!(వీడియో)

Follow us on