Haryana: కాల్పులకు జరిపిన దుండగులను చీపురుతో తరిమికొట్టిన మహిళ.. వీడియో వైరల్.

|

Nov 30, 2023 | 6:04 PM

కొందరు దుండగులు బైక్‌పై వచ్చి ఓ ఇంటి బయట నిల్చున్న వ్యక్తిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అతడు అతికష్టంమీద వారి నుంచి తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ క్రమంలో కొన్ని తూటాలు అతడి శరీరంలో దిగబడ్డాయి. అయితే, కాల్పుల శబ్దం విన్న పొరుగింటి మహిళ పొడవాటి చీపురుకర్రతో బయటకు వచ్చి దుండగులవైపు దూసుకెళ్లింది. ఆమెను అడ్డుకునేందుకు కాల్పులు జరిపినా సరే ఆమె భయపడలేదు.

కొందరు దుండగులు బైక్‌పై వచ్చి ఓ ఇంటి బయట నిల్చున్న వ్యక్తిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అతడు అతికష్టంమీద వారి నుంచి తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ క్రమంలో కొన్ని తూటాలు అతడి శరీరంలో దిగబడ్డాయి. అయితే, కాల్పుల శబ్దం విన్న పొరుగింటి మహిళ పొడవాటి చీపురుకర్రతో బయటకు వచ్చి దుండగులవైపు దూసుకెళ్లింది. ఆమెను అడ్డుకునేందుకు కాల్పులు జరిపినా సరే ఆమె భయపడలేదు. చివరికి దుండగులు పారిపోక తప్పలేదు. హర్యానాలోని భివానీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడిని హరికిషన్‌గా పోలీసులు గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో అతడికి సంబంధం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఓ హత్య కేసులో నిందితుడైన హరికిషన్ ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నాడు. దుండగుల కాల్పుల్లో గాయపడిన హరికిషన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.