Wayanad Floods: మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలోని మండక్కై జంక్షన్, చూరాల్‌మల ప్రాంతాల్లో బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. భర్త ఆచూకీ కోసం భార్య, భార్య ఏ మట్టిదిబ్బలకింద ఉందోనని భర్త... తమ పిల్లలకోసం వెతుకుతున్న తల్లిదండ్రులు ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి సంద్రం పొంగుతోంది. ఎటు చూసినా నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, భారీ బండరాళ్లు, వాటికింద నలిగిన జీవితాలే కన్పిస్తున్నాయి.
వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలోని మండక్కై జంక్షన్, చూరాల్‌మల ప్రాంతాల్లో బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. భర్త ఆచూకీ కోసం భార్య, భార్య ఏ మట్టిదిబ్బలకింద ఉందోనని భర్త… తమ పిల్లలకోసం వెతుకుతున్న తల్లిదండ్రులు ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి సంద్రం పొంగుతోంది. ఎటు చూసినా నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, భారీ బండరాళ్లు, వాటికింద నలిగిన జీవితాలే కన్పిస్తున్నాయి. మొత్తంగా ఆయా గ్రామాలు మృత్యు దిబ్బలుగా మారిపోయాయి.
కేరళ జల ప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి ఊళ్లపై పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. వందల సంఖ్యలో గాయపడ్డారు. చనిపోయిన వారిలో పిల్లలున్నారు. నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, నిట్టనిలువునా చీలిపోయిన ప్రాంతాలు, భారీ రాళ్లతో మండక్కై జంక్షన్, చూరాల్‌మల పట్టణం మృత్యు దిబ్బలుగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో వ్యాపారానికి, పర్యాటకానికి అత్యంత కీలక ప్రదేశాలు ఆనవాళ్లు కోల్పోయాయి. పైకప్పు కోల్పోయిన భవనాలు, ధ్వంసమైన వాహనాలు, పెద్ద పెద్ద రాళ్లు, బురదతో గుర్తించలేకుండా మారిపోయాయి. ‘మొత్తం కోల్పోయాం. అందరూ దూరమయ్యారు. మాకేమీ మిగల్లేదు’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు.
మండక్కైలో 450 నుంచి 500 ఇళ్లు ఉండేవి. వాటిలో ప్రస్తుతం కేవలం 34 నుంచి 49 మాత్రమే మిగిలాయి. మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించే పని సాగుతోంది. సహాయక చర్యల్లో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్‌కు చెందిన నాలుగు బృందాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందినవారు పాల్గొంటున్నారు. తాత్కాలిక వంతెనలను నిర్మించి బాధితులను తరలిస్తున్నారు. హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. కేరళలో ఇటువంటి ఉత్పాతాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం క్యాబినెట్ సమావేశానంతరం ఆయన మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమయ్యాయని మీడియాకు వివరించారు. ‘రెండు రోజుల సహాయక చర్యల్లో 1,592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. కాగా గురువారం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లోపర్యటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.