Viral: ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో

Viral: ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో

Anil kumar poka

|

Updated on: Aug 03, 2024 | 10:19 PM

తెలుగు రాష్ట్రల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. నదులు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తోటలు, అటవీ ప్రాంతాలు అన్నీ జలమయం కావడంతో విషసర్పాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తలదాచుకునేందుకు ఇళ్లలో చేరి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సందర్భంలో అనేకమంది పాముకాట్లకు గురవుతున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో విష సర్పాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. నదులు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తోటలు, అటవీ ప్రాంతాలు అన్నీ జలమయం కావడంతో విషసర్పాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తలదాచుకునేందుకు ఇళ్లలో చేరి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సందర్భంలో అనేకమంది పాముకాట్లకు గురవుతున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో విష సర్పాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గడచిన నాలుగు రోజుల్లో పదుల సంఖ్యలో పాముకాటు గురయ్యారు.

ఒకవైపు వరద ముంపు, మరోవైపు విష సర్పాలు ఇళ్లలోకి చొరబడటంతో హడలెత్తిపోతున్నారు తీర ప్రాంత వాసులు. పాశర్లపూడిలంకలో ఓ ఇంట్లోని వారు అంతా నిద్రపోతుండగా రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోనుంచి ఏవో శబ్ధాలు వినిపించాయి. ఆ ఇంటి యజమాని పరికించి చూడగా ఇంట్లోని బీరువా పక్కన త్రాచు పాము బుసలు కొడుతూ కనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కుటుంబ సభ్యులు. ఆ రాత్రి సమయంలో ఏమి చేయాలో దిక్కు తోచలేదు. చివరికి ఆ ఇంటి యజమాని సాహసం చేయక తప్పలేదు. కర్ర సహకారంతో ఆ పామును స్టీల్ బిందెలోవెళ్లేలా చేసి, బిందెలోకి వెళ్లిన తర్వాత జాగ్రత్తగా దానిని తీసుకెళ్లి నిర్మానుష ప్రదేశంలో వదిలి వేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా శివకోటిలో నలుగురు, అప్పనరామునిలంకలో ఇద్దరు, వివి మెరకలో ఒకరు, పెదపట్నం గ్రామంలో ఇద్దరు, పొన్నమండలో ఒకరు పాము కాటుకు గురై రాజోలు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు కొందరైతే ప్రైవేట్ ఆస్పత్రిలో ఆశ్రయించిన వారు మరికొందరు. నిన్న ఒక్క రోజే ముగ్గురు పాము కాటుకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు వదర బాధితులు. విష సర్పాలు వరద ఉధృతికి కొట్టుకొస్తూ జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయని విష సర్పాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరినైనా కాటు వేసిన వెంటనే కరచినిచోట గాట్లు పెట్టడం గాని మంత్రాలు వేయించుకోవడంవంటివి చేయొద్దని, పాము కాటుకు గురికాగానే ఆలస్యం చేయకుండా దగ్గర్లో ఉన్న phc సెంటర్ కు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.