Cyber Crime: ఒక్క ఫోన్ కాల్ తో 9.69 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు.!

|

Apr 03, 2024 | 10:15 PM

నగరంలో సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రోజుకో స్టైల్లో.. కొత్త కొత్త స్ట్రాటజీలతో అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. అయితే.. తెలియకుండా మోసాలు చేయడం కామన్.. కానీ.. ఇప్పుడు.. చెప్పి మరీ మోసాలకు పాల్పడుతుండడం షాకిస్తోంది. డ్రగ్స్ పార్సిల్స్ పేరు తో, మీకు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని కేసు బుక్ అయిందటూ బాధితులను భయభ్రాంతులకి గురి చేసి డబ్బులను దండుకుంటున్నారు..

సికింద్రాబాద్‌కు చెందిన బాధితుడికి బ్యాంకాక్ నుంచి పార్సిల్ వచ్చిందని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అందులో డ్రగ్స్‌ ఉన్నాయని, మీకు ఉగ్రవాదులతో లింక్‌లు ఉన్నాయని మీపై కేసు బుక్‌ అయిందని చెప్పాడు. ముంబై కస్టమ్స్‌ అధికారులు మీ మొత్తం కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారని బెదిరించాడు. ఈ కేసునుంచి మీరు బయటపడాలంటే వెంటనే ఈ ఎకౌంట్‌కు డబ్బు పంపించమని డిమాండ్‌ చేశాడు సైబర్‌ మోసగాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు రూ 9.69 లక్షల రూపాయలను సదరు వ్యక్తి చెప్పిన ఎకౌంట్‌కు బదిలీ చేశాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సాగర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా పార్శిల్స్‌ పేరుతో వచ్చే ఫోన్లను నమ్మవద్దని, ఎవరూ ఎలాంటి భయాందోళన చెందకుండా వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. అపరిచితుల నుండి కాల్స్ వచ్చిన తర్వాత డబ్బులు అడిగితే వెనకాముందు ఆలోచించకుండా..తొందరపడి డబ్బులు పంపించవద్దని పోలీసులు సూచించారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు విపరీతంగా పెరిగిపోయాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


మరిన్ని వీడియోస్ కోసం:

Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..