EPFO: ఈపీఎఫ్‌వో కొత్తరూల్.. ఉద్యోగం మారినా పీఎఫ్ గురించి టెన్షన్ అక్కర్లేదు.!
కొత్త అవకాశాలు, మెరుగైన వేతనం కోసం ఉద్యోగం మారిన వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లింక్ చేయడం.. ఇప్పటి వరకు దీనికోసం కొత్త సంస్థ నుంచి మాన్యువల్ గా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈ దరఖాస్తు ప్రక్రియ తప్పనిసరిగా చేయాల్సిందే. లేదంటే పీఎఫ్ ఖాతా సీనియారిటీ లెక్కలోకి రాదు. దీంతో ఉద్యోగస్తులు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందలేరు.
కొత్త అవకాశాలు, మెరుగైన వేతనం కోసం ఉద్యోగం మారిన వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లింక్ చేయడం.. ఇప్పటి వరకు దీనికోసం కొత్త సంస్థ నుంచి మాన్యువల్ గా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈ దరఖాస్తు ప్రక్రియ తప్పనిసరిగా చేయాల్సిందే. లేదంటే పీఎఫ్ ఖాతా సీనియారిటీ లెక్కలోకి రాదు. దీంతో ఉద్యోగస్తులు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందలేరు. అయితే, ఇకపై ఈ ఇబ్బంది ఉండదని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. అదే ‘ఆటోమేటెడ్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ ఫర్ సిస్టం. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుంది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఉద్యోగం మారిన సందర్భంలో సదరు ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లు కూడా ఆటోమేటిక్ గా విలీనం అవుతాయి. పాత ఖాతాలో ఉన్న నిధులు కొత్త ఖాతాలోకి బదిలీ అవుతాయి. దీంతో పీఎఫ్ ఖాతాలో సీనియారిటీ విషయంలోనూ టెన్షన్ పడాల్సిన అవసరం ఉద్యోగికి ఉండదు. సాధారణంగా పీఎఫ్ ఖాతాలో నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్నపుడు కొంత మొత్తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల సర్వీసు దాటిన ఖాతాల నుంచి సొమ్ము తీసుకున్నప్పుడు ఈ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. తాజాగా అమలులోకి వచ్చిన రూల్ తో ఉద్యోగం మారినా పీఎఫ్ ఖాతా సీనియారిటీ విషయంలో మార్పుండదు కాబట్టి ఈ ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనం పొందే అవకాశం కలుగుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

