Crime: భర్తపై దాడి.. ఆటోలో వెళుతున్న భార్య కిడ్నాప్.. కారణం అదేనా.? వీడియో..

|

Aug 14, 2023 | 9:47 AM

భద్రాచలం జిల్లా కొత్తగూడెంలో సినిమా స్టైల్లో జరిగిన కిడ్నాపింగ్ కలకలం రేపుతోంది. భర్త కళ్లముందే భార్యను కిడ్నాప్ చేశారు కొందరు దుండగులు. భర్తపై దాడిచేసి మరీ భార్యను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు . అసలేం జరిగిందంటే.. ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెం నగరానికి చెందిన గొగ్గెల మాధవి పెద్దల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.

భద్రాచలం జిల్లా కొత్తగూడెంలో సినిమా స్టైల్లో జరిగిన కిడ్నాపింగ్ కలకలం రేపుతోంది. భర్త కళ్లముందే భార్యను కిడ్నాప్ చేశారు కొందరు దుండగులు. భర్తపై దాడిచేసి మరీ భార్యను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు . అసలేం జరిగిందంటే.. ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెం నగరానికి చెందిన గొగ్గెల మాధవి పెద్దల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. .పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని.మాధవి కుటుంబ సభ్యులు మాధవిపై కోపంతో ఉన్నారు.. గురువారం భార్యను ప్రాజెక్టు వర్కు నిమిత్తం ఖమ్మం నుంచి కొత్తగూడెం కళాశాలకు ఆటోలో తీసుకెళుతుండగా మార్గమధ్యలో కారులో ఛేజ్ చేసిన దుండగులు ఆటోను నిలిపివేశారు. ఆ పై యువకుడిపై దాడి చేసి యువతిని బలవంతంగా కార్లో ఎత్తుకెళ్లారు. కులాంతర ప్రేమవివాహం కారణంగానే తనపై దాడి చేసి తన భార్యను కిడ్నాప్ చేశారని బాధిత యువకుడు ఆరోపించారు. తనకూ, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్‌ అయిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...