Theft in temple: గుడిలో చోరీ.. అంతలోనే సారీ.. తప్పుచేశాను క్షమించమంటూ వస్తువులతోపాటు లేఖ..

|

Nov 04, 2022 | 8:50 PM

“నేను చేసిన పనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను తప్పు చేసాను, నన్ను క్షమించండి. దొంగతనం చేసిన తర్వాత నేను చాలా బాధపడ్డానని ఆ లెటర్ లో ఆ దొంగ రాసినట్లు పోలీసులు చెప్పారు.


మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని ఓ ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు ఓ దొంగ. అక్టోబరు 24న లమ్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినాథ్ దిగంబర్ జైన్ టెంపుల్ నుండి ‘ఛత్రాలు’ ఇత్తడి వస్తువులతో సహా అలంకరణకు ఉపయోగించే వస్తువులను గుర్తుతెలియని దొంగ దొంగిలించాడు. ఆలయ సిబ్బంది సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అక్టోబరు 28న కొందరు వ్యక్తులు లామ్టాలోని పంచాయితీ కార్యాలయం సమీపంలోని గొయ్యిలో పడి ఉన్న బ్యాగ్‌ను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీకి గురైన వస్తువులను బ్యాగ్‌లో పెట్టిన దొంగ ఒక క్షమాపణ లేఖ కూడా అందులో పెట్టాడు. లేఖతో సహా వస్తువులున్న బ్యాగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ లెటర్ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. “నేను చేసిన పనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను తప్పు చేసాను, నన్ను క్షమించండి. దొంగతనం చేసిన తర్వాత నేను చాలా బాధపడ్డానని ఆ లెటర్ లో ఆ దొంగ రాసినట్లు పోలీసులు చెప్పారు. దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకుని.. దొంగను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Follow us on