Viral Video: మాస్టారూ వెళ్లొద్దంటూ కన్నీరుమున్నీరైన విద్యార్థినిలు.. ఉపాధ్యాయుడు సైతం కంటతడి.

|

Jul 12, 2023 | 7:25 PM

తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత ఒక్క గురువుకే ఉంది. అందుకే కొందరు ఉపాధ్యాయులు తమ విద్యార్ధులను సొంత పిల్లల్లా భావిస్తారు. వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నిష్కల్మషంగా కృషిచేస్తారు. ఇక విద్యార్ధులు కూడా అలాంటి గురువులను ఎంతగానో అభిమానిస్తారు.

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఉన్నత పాఠశాలలో పిల్లలకు కేవలం చదువు చెప్పడమే కాదు వారి ఆప్యాయత అనురాగాలను చూరగొన్నాడు ఆ ఉపాధ్యాయుడు. అనూహ్యంగా ఉపాధ్యాయుడికి బదిలీ ఆర్డర్ వచ్చింది. ఇక అంతే ఆ పాఠశాలలో ని విద్యార్థులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. అది చూసి ఆ ఉపాధ్యాయుడు సైతం కంటతడి పెట్టిన ఘటన స్థానికులను కలచివేసింది. శివన్న అనే తెలుగు ఉపాధ్యాయుడు గత ఐదేళ్లుగా ఆ పాఠశాలలో ఎంతో క్రమశిక్షణగా బాలికలకు చదువు చెప్పాడు. తమను ఎంతగానో అభిమానించే టీచర్‌ వెళ్లిపోతుండటంతో ఆ విద్యార్ధినులు మాస్టారూ మీరు వెళ్లొద్దు అంటూ బోరున విలపించారు. వెళ్లక తప్పని పరిస్థితిలో ఉపాధ్యాయునికి విద్యార్ధినిలు సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయుని పట్టుకొని విద్యార్ధినిలు కన్నీటిపర్యంతమయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...