Tallest woman: తొలిసారి విమానమెక్కిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌..

|

Nov 08, 2022 | 9:16 AM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ మొదటిసారి విమానం ఎక్కింది. టర్కీకి చెందిన 25 ఏళ్ల రుమెయ్‌సా గెల్గీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది.

తొలిసారి విమానమెక్కిన అత్యంత ఎత్తైన మహిళ..! @TV9 Telugu Digital
తాజాగా ఈమె తొలిసారి విమాన ప్రయాణం చేసింది. టర్కీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 13 గంటల పాటు విమానంలో ప్రయాణించింది. ఈమె కోసం టర్కిష్‌ ఎయిర్‌లైన్‌ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ఆరు సీట్లను ఒక స్ట్రెచర్‌పైకి చేర్చి ఆమె పడుకునేందుకు అనువుగా ఉండేలా చూసింది. ఈ విషయాన్ని రుమెయ్‌సా గెల్గీ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ద్వారా తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌లైన్‌ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ‘ఇది నా తొలి విమాన ప్రయాణం. నా ఈ మొదటి ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. నాతోపాటు ప్రయాణించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ప్రయాణం చివరిది కాకూడదని కోరుకుంటున్నా’’ అంటూ పోస్టు చేసింది. దీనిపై ఎయిర్‌లైన్స్‌ సంస్థ స్పందించింది. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తామంటూ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా రుమెయ్‌సా గిన్నిస్‌ రికార్డు సాధించింది. ఈమె ఎత్తు ఏడు అడుగులు. అత్యంత పొడవైన వేళ్లు, వీపు కలిగిన మహిళగా ఈమె పేరితో రికార్డులున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 08, 2022 09:16 AM