Viral Video: తవ్వకాల్లో బయటపడ్డ అతి పాత బీరువా..! అతి పురాతన బీరువా తెరిచి చూడగా కళ్ళు చెదిరే..
రాయలసీమ.. ఒకనాటి రతనాల సీమ. రాయలవారి కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెపుతోంది. అలాంటి రాయలసీమలోని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో పాత కాలం నాటి బీరువా తవ్వకాల్లో బయటపడింది.
రాయలసీమ.. ఒకనాటి రతనాల సీమ. రాయలవారి కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెపుతోంది. అలాంటి రాయలసీమలోని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో పాత కాలం నాటి బీరువా తవ్వకాల్లో బయటపడింది. స్థానికంగా నివాసం ఉండే నర్సింహులు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తుండగా.. ఇనుప బీరువా కనిపించింది. పురాతన భవంతి గోడలను జేసీబీలతో పగుల గొడుతుండగా భారీ ఇనుప పెట్టెను గుర్తించారు. అచ్చం నేటితరం లాకర్‌లను పోలి ఉన్న ఈ పెట్టెపై ఇంగ్లీషులో మద్రాసు అని రాసివుంది. దానిపైన లక్ష్మీదేవి బొమ్మ ఉంది. ఈ ఇనుప పెట్టె ఇంచుకూడా కదపలేనంత బరువుంది. దీంతో ట్రాక్టర్‌లో తీసుకొచ్చి, తెరిచేందుకు విఫలయత్నం చేశారు గ్రామస్తులు. భారీ బందోబస్తుతో బ్యాంకు లాకర్‌లకన్నా బలంగా ఉన్న ఈ పెట్టెకు రెండు తాళాలున్నాయి. ఇది పురాతన కాలానిది కావడంతో ఇందులో భారీగా బంగారం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసింది. దీన్ని పరిశీలించి, ఓపెన్ చేసి.. అందులో ఏముందనేది తేల్చబోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..