Viral Video: అంత తుత్తర ఎందుకు తమ్ముడు.. సరదా బెట్టింగ్ కాస్త ఆసుపత్రి పాలు చేసే.. వీడియో.
ఇద్దరు విద్యార్థుల మధ్య పందెం ఓ యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది. కృష్ణాజిల్ల గుడివాడకు చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు పందెం కాసుకున్నారు. అది మామూలు పందెం కాదు..
ఇద్దరు విద్యార్థుల మధ్య పందెం ఓ యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది. కృష్ణాజిల్ల గుడివాడకు చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు పందెం కాసుకున్నారు. అది మామూలు పందెం కాదు.. కదులుతున్న రైలు ఎక్కాలన్నది బెట్. అయితే ఆగి వెళ్లే రైలైతే.. స్లోగా ఉన్నప్పుడు ఎక్కొచ్చులే అనుకోవచ్చు. కానీ అది గూడ్సురైలు.. అది ఆగేది కాదు.. కాకపోతే స్లోగా వెళ్తుంది.. ఆ…అదెంత సేపు బస్సులెక్కిన అనుభవం ఉందిగా ఎక్కేద్దామనుకున్నాడు పాపం మరో విద్యార్థి. అందుకే బెట్ కాశాడు. ఇంకేముంది రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డాడు. రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన కుర్రాడు ప్రమాదవశాత్తూ కింద పడ్డంతో కాలుపోగొట్టుకున్నాడు. సరదా కోసం చేసిన స్టంట్ కాలు పోయేలా చేసింది. పందెం దెబ్బకు కాలు పోగొట్టుకొని ఆసుపత్రిపాలయ్యాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..