Viral Video: కలియుగ శ్రవణుడు.. కావడిలో కన్నతల్లి.. శివానుగ్రహం కోసం కొడుకు పయనం..
ఉత్తర భారత దేశంలో కన్వర్ యాత్ర మొదలై రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. హిందువుల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్ లో కన్వర్ యాత్ర జూలై 15 వరకు జరుగుతుంది. ఈ ఏడాది దాదాపు 2 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా..
ఉత్తర భారత దేశంలో కన్వర్ యాత్ర మొదలై రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. హిందువుల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్ లో కన్వర్ యాత్ర జూలై 15 వరకు జరుగుతుంది. ఈ ఏడాది దాదాపు 2 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. ఈ యాత్రలో పలువురు భక్తులు పాల్గొన్న వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ యువకుడు కావిడి ఎత్తుకుని వెళ్తున్నాడు. ఆ కావిడి లో ఒక వైపు తన తల్లిని ..మరోవైపు గంగాజలాన్ని పెట్టుకొని తనభుజాలపై కావడి మోస్తూ శివయ్యను స్మరిస్తూ వెళ్తున్న వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 62,000 మందికి పైగా వీక్షించారు. 2,300 మందికి పైగా లైక్ చేశారు. వందలాది మంది రీట్వీట్ చేశారు. నెటిజనులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
కన్వర్ యాత్ర ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ప్రారంభమైంది. ఇక్కడ గంగాజలాన్ని సేకరించి తమ తమ స్వగ్రామాలలోని శివాలయాలకు సమర్పిస్తారు. ఈ యాత్రకు వచ్చే వారు కాలినడకన వెళతారు. తమ స్వస్థలాలకు.. తిరిగి వెళ్లేటప్పుడు బీహార్‌లోని గౌముఖ్, గంగోత్రి, సుల్తాన్‌గంజ్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...