Pilot Heart Attack: విమానం గాల్లో ఉండగా.. కుప్పకూలిన పైలట్‌..! వీడియో వైరల్..

|

Aug 19, 2023 | 8:35 PM

అమెరికా లోని మియామి నుంచి చిలీ బయల్దేరిన ఓ కమర్షియల్‌ విమానంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విమానం ప్రయాణిస్తుండగా పైలట్‌ హఠాత్తుగా కుప్పకూలారు. దీంతో అప్రమత్తమైన కో-పైలట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ పైలట్‌ ప్రాణాలు కోల్పోయారు. లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ఓ విమానం స్థానిక కాలమానం ప్రకారం..

అమెరికా లోని మియామి నుంచి చిలీ బయల్దేరిన ఓ కమర్షియల్‌ విమానంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విమానం ప్రయాణిస్తుండగా పైలట్‌ హఠాత్తుగా కుప్పకూలారు. దీంతో అప్రమత్తమైన కో-పైలట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ పైలట్‌ ప్రాణాలు కోల్పోయారు. లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ఓ విమానం స్థానిక కాలమానం ప్రకారం.. మియామీ ఎయిర్‌పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన మూడు గంటల తర్వాత కెప్టెన్‌ ఇవాన్‌ ఆండౌర్‌ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన ఇతర సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో అప్రమత్తమైన కో-పైలట్లు విమానాన్ని సమీపంలోని పనామా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌చేశారు. అనంతరం ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ సిబ్బంది ఇవాన్‌ను పరిశీలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన సమయంలో విమానంలో 271 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 56 ఏళ్ల ఇవాన్‌ గత 25 ఏళ్లుగా పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపై లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ ఘటన నేపథ్యంలో ఆ విమానంలోని ప్రయాణికులను మరుసటి రోజు చిలీకి చేర్చినట్లు ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...