Viral: నడిసంద్రంలో చైనీయుడికి గుండెపోటు.. కాపాడిన బారత కోస్ట్‌గార్డ్. వీడియో..
ముంబై తీరంలో అరేబియా సముద్రంలో నౌకలో ప్రయాణిస్తున్న ఓ చైనా వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గుండెపోటు కు గురవడంతో అతడ్ని కాపాడేందుకు భారత కోస్ట్‌గార్డ్ ప్రతికూల వాతావరణంలో సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. చిమ్మచీకట్లో అతడిని ఎయిర్‌లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించింది. ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నంబర్ 2 రీసర్చ్ నౌక చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూఈఏ వెళ్తోంది.
ముంబై తీరంలో అరేబియా సముద్రంలో నౌకలో ప్రయాణిస్తున్న ఓ చైనా వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గుండెపోటు కు గురవడంతో అతడ్ని కాపాడేందుకు భారత కోస్ట్‌గార్డ్ ప్రతికూల వాతావరణంలో సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. చిమ్మచీకట్లో అతడిని ఎయిర్‌లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించింది. ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నంబర్ 2 రీసర్చ్ నౌక చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూఈఏ వెళ్తోంది. బుధవారం రాత్రి ఈ నౌకలో పనిచేస్తున్న సిబ్బంది యిన్ వీగ్‌యాంగ్ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. ఛాతినొప్పితో విలవిల్లాడిపోయారు.
దీంతో నౌక సిబ్బంది సమీప తీర ప్రాంతమైన ముంబయిలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు అత్యవసర సందేశం పంపారు. దీంతో అప్రమత్తమైన భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది బాధితుడిని అత్యవసరంగా ఆసుపత్రికి చేర్చేందుకు ఏఎల్‌హెచ్ ఎంకే-3 హెలికాప్టర్‌తో బయల్దేరారు. ఆ సమయంలో చైనా నౌక అరేబియా సముద్రంలో తీరానికి దాదాపు 200 కి.మీల దూరంలో ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. అయినప్పటికీ కోస్ట్‌గార్డ్ చిమ్మచీకట్లో ధైర్యంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి సమయంలో నౌకలో నుంచి వీగ్‌యాంగ్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేసి హెలికాప్టర్‌లోనే ప్రథమ చికిత్స అందించింది. అనంతరం సమీప ఆసుపత్రికి తరలించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

