Monkey Viral Video: వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లి.. తానే డాక్టర్‌తో పరీక్షలు చేయించుకున్న వానరం.. వైరల్ అవుతున్న వీడియో..
ఓ కోతి తన బిడ్డతో సహా ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్‌ని వైద్యం చెయ్యమన్నట్టుగా అక్కడ చెకప్ చేసే బల్లపైన పడుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఓ కోతి తన బిడ్డతో సహా ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్‌ని వైద్యం చెయ్యమన్నట్టుగా అక్కడ చెకప్ చేసే బల్లపైన పడుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆస్పత్రికి వచ్చిన ఈ కోతిని చూసేందుకు జనంగ ఎగబడ్డారు. వివరాల్లోకి వెళ్తే…బీహార్‌లోని ససరంలోని షాజమా ప్రాంతంలో ఉన్న ఓ క్లినిక్‌కి ఓ వానరం తన బిడ్డతో సహా వచ్చింది. నేరుగా వెళ్లి డాక్టర్ సీటుకు ఎదురుగా ఉన్న బెడ్‌పైన పడుకుంది. మొదట దానిని చూసి డాక్టర్ భయపడ్డాడు. కానీ అది అతన్ని ఏమీ చేయకపోగా.. దీనంగా అతనివైపు చూసింది. అది గమనించిన డాక్టర్ కోతిని పరీక్షగా చూశాడు. అది ఏదో ప్రమాదంలో గాయపడినట్లు గ్రహించాడు. వెంటనే డాక్టర్ ఆ కోతికి వైద్యం చేసాడు. గాయాలపై ఆయింట్‌మెంట్ పూసి కట్టుకట్టారు. చికిత్స పొందుతున్నంత సేపు ఆ కోతి ఎంతో సహనంగా ఉండి అక్కడి బెడ్‌పై విశ్రాంతి తీసుకుంది.
ఈ విషయం తెలిసిన స్థానికులు కోతిని చూసేందుకు ఎగబడ్డారు. ఆ తర్వాత జనం అక్కడి నుంచి వెళ్లిపోయిన కొంత సేపటికి కోతి కూడా తన పిల్లతో సహా వెళ్లిపోయింది. కాగా, క్లినిక్‌లో చికిత్స పొందిన కోతి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!