Divote tour: ఇదేం భక్తి..! చేతులతో నడుస్తూ బైద్యనాథుడి దర్శనానికి.. యూపీ నుంచి ఝార్ఖండ్ కు.. వీడియో.
భక్తులు దైవ దర్శనం చేసుకోడానికి సుదూర ప్రాంతాలకు తీర్ధ యాత్రలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కొక్కరూ ఒక్కోరకంగా తీర్ధయాత్రలు చేస్తారు. కొందరు
భక్తులు దైవ దర్శనం చేసుకోడానికి సుదూర ప్రాంతాలకు తీర్ధ యాత్రలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కొక్కరూ ఒక్కోరకంగా తీర్ధయాత్రలు చేస్తారు. కొందరు తమ మొక్కులో భాగంగా నడిచి వెళ్తారు. అయితే ఇక్కడ ఓ భక్తుడు తన మొక్కు తీర్చుకోడానికి వినూత్నంగా తీర్ధ యాత్రకు బయలుదేరాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అశోక్ అనే ఓ 46 ఏళ్ల భక్తుడు తన ఇష్టదైవమైన బైద్యనాథ్ దర్శనం చేసుకోవాలనుకున్నాడు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్‌గఢ్‌లో గల బాబా బైద్యనాథ్ దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటే పొరపాటే. అతను మామూలుగా నడిచి వెళ్లడం లేదు. కాళ్లు పైకెత్తి చేతులమీద నడుస్తూ వెళ్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బలియానుంచి జూలై 11వ తేదీన అశోక్ యాత్ర ప్రారంభించారు. బైద్యనాథుని దర్శనంతోనే తన యాత్ర ముగిస్తానని చెబుతున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..