Viral Video: మహా మేధావి గురు..! భార్య చికెన్ వండలేదని కంప్లైట్.. ఖాకీలిచ్చిన షాక్‌కు కంగుతిన్న భర్త..!
చికెన్ వండలేదని భర్తకు కోపం వచ్చింది. దీంతో ఆయనకు ఏం చేయాలో అర్ధం కాలేదు. వెంటనే 100 కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. పోలీసులు తన సమస్యను పరిష్కరిస్తారనుకున్న ఆ వ్యక్తికి ఖాకీలు షాకిచ్చారు. సమయాన్ని వృధా చేసినందుకు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
చికెన్ వండలేదని భర్తకు కోపం వచ్చింది. దీంతో ఆయనకు ఏం చేయాలో అర్ధం కాలేదు. వెంటనే 100 కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. పోలీసులు తన సమస్యను పరిష్కరిస్తారనుకున్న ఆ వ్యక్తికి ఖాకీలు షాకిచ్చారు. సమయాన్ని వృధా చేసినందుకు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం చర్ల గౌరారానికి చెందిన ఓర్సు నవీన్ అనే యువకుడు మద్యం మత్తులో 100కు ఆరు సార్లు ఫోన్ చేశాడు. ఎంటోనంటూ ఆరా తీయగా.. అతను చెప్పే మాటలు విని కోపం వచ్చింది. హోలీ పండగ రోజు తన భార్య చికెన్ తీసుకొచ్చి వంటచేసి పెట్టలేదని.. ఆమెపై చర్య తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశాడు. అయితే.. ముందు ఫోన్ కట్ చేసినప్పటికీ.. మళ్లీ మళ్లీ ఫోన్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేశాడు. దీంతో పోలీసులు నవీన్ పై సీరియస్ అయ్యారు. డయల్ 100కు ఫోన్ చేసి తమ టైమ్ వేస్ట్ చేసినందుకు నవీన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నగేశ్ వెల్లడించారు. ఆపద, అత్యవసర సమయంలో మాత్రమే 100 కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!