Mobile Movie Theater: ఏపీలో మొదటి మొబైల్ సినిమా థియేటర్.. ఆ సినిమాతోనే ప్రారంభానికి ఏర్పాట్లు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్న రీతిలో మొదటిసారిగా మొబైల్ సినిమా థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి జిల్లాలోని రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్న రీతిలో మొదటిసారిగా మొబైల్ సినిమా థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి జిల్లాలోని రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ థియేటర్‌ను రూపొందిస్తున్నారు. ఢిల్లీకి చెందిన “పిక్చర్ డిజిటల్స్” సంస్ధ ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిదని నిర్వాకులు తెలిపారు. ఈ మొబైల్ ధియేటర్లు RRR మూవీ రిలీజ్‌నాటికే మొదలు కావాల్సి ఉంది…కాగా కొన్ని పర్మిషన్ల దృష్ట్యా ఆలస్యం కావడంతో.. మెగాస్టార్ ఆచార్య సినిమాతో ధియేటర్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు..ఇది ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన, సౌకర్యవంతమైన రూపమని తెలిపారు. అలాగే.. దీనిని ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోవచ్చు. ఈ మొబైల్ థియేటర్ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలో మరిన్ని చోట్ల ఇలాంటి థియేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.మొత్తం మొబైల్ ఎయిర్ బెలూన్ థియేటర్ లో 120 సిట్లతో పాటు 5.1 surround sound system తో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు… మల్టీప్లెక్స్ థియేటర్లకు ఏమాత్రం తీసిపోనివిధంగా వాష్ రూమ్స్ , ఏసి తో పాటు.. లేటెస్ట్ టెక్నాలజీ ని వాడుతూ దీనిని కేవలం ఐదు నుంచి ఏడు రోజుల్లో పూర్తి చేశారు…. ఈ మొబైల్ ఎయిర్ బెలూన్ రూమ్ థియేటర్ ఇప్పుడు రాజానగరం లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుందని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..